Vijay Devarakonda – Dulquer Salmaan : నాకు, దుల్కర్ సల్మాన్ కు కలిపి మల్టీస్టారర్ కథ చెప్పారు.. కానీ..

ఈవెంట్లో విజయ్ దేవరకొండ సినిమా గురించి, త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు. అలాగే దుల్కర్ సల్మాన్ తో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పాడు.

Vijay Devarakonda speak about Multi Starrer with Dulquer Salmaan

Vijay Devarakonda – Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా తాజాగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ గెస్ట్ లుగా వచ్చారు.

ఈవెంట్లో విజయ్ దేవరకొండ సినిమా గురించి, త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు. అలాగే దుల్కర్ సల్మాన్ తో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పాడు.

Also Read : Vijay Devarakonda : పెళ్లి చూపులు హిట్ అయ్యాక త్రివిక్రమ్ సర్ పిలిచి చెక్ ఇచ్చి.. ఆ రోజు ఎప్పటికి మర్చిపోలేను.. విజయ్ వ్యాఖ్యలు..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను నా బ్రదర్ దుల్కర్ కోసం వచ్చాను. కల్కి, మహానటి సినిమాల్లో ఇద్దరం నటించాము. కానీ మా ఇద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవు. గతంలో ఒక డైరెక్టర్ దుల్కర్, నాతో కలిసి మల్టీస్టారర్ చేయాలని ప్రయత్నించాడు. అప్పుడు చెన్నైలో కలిసి కథ కూడా విన్నాము. కానీ ఆ సినిమా అవ్వలేదు భవిష్యత్తులో ఇద్దరం కలిసి సినిమా చేయొచ్చేమో అని అన్నారు.

దీంతో విజయ్, దుల్కర్ ఫ్యాన్స్ వీళ్లిద్దరి కాంబో పడితే నిజంగానే ఆ మల్టీస్టారర్ సినిమా అదిరిపోతుంది అని అంటున్నారు. ఇక ఈవెంట్లో విజయ్, దుల్కర్ కలిసి దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.