Sakshi Agarwal: పాపం.. ఈ బ్యూటీకి వింత సమస్య వచ్చింది.. ఒకటి అనుకోని ఇంకోటి తిన్నదట.. చాలా బాధపడుతోంది!

ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ యాప్ లలో చాలా తప్పులు జరుగుతున్నాయి. వాటిలో(Sakshi Agarwal) వచ్చే ఆహారంలో పురుగులు, కీటకాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.

Sakshi Agarwal: పాపం.. ఈ బ్యూటీకి వింత సమస్య వచ్చింది.. ఒకటి అనుకోని ఇంకోటి తిన్నదట.. చాలా బాధపడుతోంది!

Tamil beauty Sakshi Agarwal eats non-veg food instead of veg

Updated On : September 22, 2025 / 6:42 PM IST

Sakshi Agarwal: ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ యాప్ లలో చాలా తప్పులు జరుగుతున్నాయి. వాటిలో వచ్చే ఆహారంలో పురుగులు, కీటకాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలానే పరిస్థితులు కేవలం కామన్ ప్రజలకు మాత్రమే కాదు సెలబ్రెటీలకు కూడా ఎదురవుతున్నాయట. అలాంటి ఒక వింత సంఘటనే ఒక స్టార్ బ్యూటీకి ఎదురవ్వడంతో చాలా బాధపడుతోంది. ఈ బ్యూటీ మరెవరో కాదు సాక్షి అగర్వాల్(Sakshi Agarwal). ఇటీవల ఈ అమ్మడు తనకు జరిగిన ఈ సంఘటన గురించి వివరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Avika Gor-Milind Chandwani: పెళ్లి పీటలు ఎక్కబోతున్న అవికా.. పెళ్లి డేట్ చెప్పేసింది.. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా?

ఇంతకీ అసలు విషయం ఏంటంటే? ఇటీవల సాక్షి అగర్వాల్ ఫుడ్ డెలివరీ యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసిందట. అయితే ఆమె ప్యూర్ వెజిటేరియన్. తన లైఫ్ లో ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినలేదు. అందుకే, పన్నీర్ బిర్యానిని ఆర్డర్ చేసింది. కానీ, డెలివరీ చేయడం మాత్రం చికెన్ బిర్యాని డెలివరీ చేశారు. బాగా ఆకలిగా ఉండటంతో వచ్చింది చికెన్ బిర్యానీ అని గమనించక తినేసిందట. తరువాత తాను తిన్నది చికెన్ అని తెలిసి అవాక్కయ్యిందట. లైఫ్ లో ఒక్కసారి కూడా నాన్ వెజ్ ని తినని తనతో చికెన్ తినేలా చేశారని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది సాక్షి అగర్వాల్. అలాగే తనకు ఆ ఫుడ్ డెలివరీ చేసిన సంస్థపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.