Vijay Devarakonda : పెళ్లి చూపులు హిట్ అయ్యాక త్రివిక్రమ్ సర్ పిలిచి చెక్ ఇచ్చి.. ఆ రోజు ఎప్పటికి మర్చిపోలేను.. విజయ్ వ్యాఖ్యలు..
త్రివిక్రమ్ - విజయ్ కలిసి మొదటిసారి ఇలా స్టేజిపై కనపడి, వాళ్ళ మధ్య చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో విజయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Vijay Devarakonda Interesting Comments on Trivikram Srinivas in Lucky Baskhar Pre Release Event
Vijay Devarakonda : దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అభిమానులను కలిసి చాలారోజులు అవుతుంది. మీరందరూ సంతోషంగా బాగున్నారని అనుకుంటున్నాను. నా సోదరుడు దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది. పెళ్లిచూపులు హిట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్ కి పిలిపించి కూర్చోబెట్టి నాతో మాట్లాడి నాకు నా ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఏడేళ్లవుతుంది చాలా రోజులు పట్టింది సినిమా చేయడానికి. ఇప్పుడు ‘VD12’ గా రాబోతుంది ఆ సినిమా. ఆ రోజు త్రివిక్రమ్ గారిని కలవడం నా లైఫ్ లో మర్చిపోలేను. మన జనరేషన్ కి మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జల్సా లాంటి మంచి సినిమాలు, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా లాంటి సినిమాలు ఇచ్చిన ఆయన మనల్ని ఆఫీస్ కి పిలిచి కూర్చోబెట్టి నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆయన నా అభిమానుల్లో దర్శకుల్లో ఒకరు. ఆ తర్వాత ఆయనను చాలాసార్లు కలిశారు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి త్రివిక్రమ్ గారు చెబుతూ ఉంటే అలా వింటూ కూర్చోవచ్చు అని అన్నారు.
ఇక లక్కీ భాస్కర్ సినిమా గురించి మాట్లాడుతూ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అసలు త్రివిక్రమ్ – విజయ్ కలిసి మొదటిసారి ఇలా స్టేజిపై కనపడి, వాళ్ళ మధ్య చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో విజయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.