Flipkart Big Billion Days Sale : ఇది కదా ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే? ఓసారి లుక్కేయండి
Flipkart Big Billion Days Sale : ఆపిల్ ఐఫోన్ 16ప్రో ధర తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభ సేల్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఇంతకీ ఈ ఐఫోన్ డీల్ కొనాలా? వద్దా?

Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర భారీ తగ్గింపుతో లభ్యం కానుంది. ఈ ఐఫోన్ మోడల్ ధర ఏకంగా రూ. 69,999 వరకు లభించనుంది.

ఇలాంటి అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో గత ఏడాదిలో రూ. 1,19,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఐఫోన్ యాక్షన్ బటన్‌తో వస్తుంది. వాయిస్ మెమోలు, ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచడం, కెమెరా కంట్రోల్ బటన్ వంటి ఫీచర్‌లతో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.

మీరు కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 16 ప్రో రూ. 69,999కు లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ఈ డీల్ 128GB వేరియంట్‌కు మాత్రమే. ఐఫోన్ 16 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999కే ఐఫోన్ 16 ప్రో.. ప్రీ-బుకింగ్ ఎలా? : ఆసక్తిగల కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 5వేలకు పాస్ కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్ 2025లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో మొదటి 24 గంటల ముందస్తు యాక్సెస్‌కు మాత్రమే చెల్లుతుంది. ఒకసారి కొంటే క్యాన్సిల్ చేయలేరు. డబ్బులు రీఫండ్ రావు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (ఎర్లీ యాక్సెస్) మొదటి 24 గంటల్లో కొన్ని ఐఫోన్ 16 ప్రో మోడల్స్ (128GB, 256GB వేరియంట్‌లు) మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాస్ కోసం చెల్లించిన రూ. 5వేలు చెల్లింపు సమయంలో కొనుగోలు ధరకు అడ్జెస్ట్ అవుతుంది. అదనపు కూపన్ కోడ్‌లు అవసరం లేదు. కొనుగోలుపై గురించి కచ్చితంగా తెలిస్తేనే పాస్‌ను కొనుగోలు చేయాలని ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు సూచించింది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధరలు : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే అన్ని బ్యాంక్ డిస్కౌంట్లు, ధర తగ్గింపులతో ఐఫోన్ 16 ప్రో రూ.69,999కు లభిస్తుందని వెల్లడించింది. ఈ సేల్ సమయంలో డిస్కౌంట్ల తర్వాత టాప్-ఎండ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.89,999కు కొనుగోలు చేయొచ్చు.