Amazon Festival Sale Offers : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!
Amazon Great Indian Festival Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 భారీ ధర తగ్గింపును పొందనుంది.

Amazon Great Indian Festival Sale 2025 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన అవకాశం. రెండేళ్ల క్రితం లాంచ్ అయిన ఐఫోన్ 15 భారీ తగ్గింపు ధరకే లభించనుంది. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభం కానుంది.

ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ ధర తగ్గింపు పొందవచ్చునని అమెజాన్ ధృవీకరించింది. ఆపిల్ ప్రీమియం ఐఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్ ఐఫోన్ 15 ఆఫర్ : ఆపిల్ ఐఫోన్ 15 (128GB, బ్లాక్) అసలు ధర రూ.79,900కు పొందవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అమెజాన్ ధర రూ.45,249కి తగ్గనుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.34,651 సేవ్ చేసుకోవచ్చు.

అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియదు. అమెజాన్ ప్రస్తుతానికి ఆ వివరాలను రివీల్ చేయలేదు. ఫైనల్ ధర ఎంత ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 16, 17 సిరీస్‌లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్, డాల్బీ విజన్ సపోర్టుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది, ఇండోర్, అవుట్‌డోర్‌లలో స్పష్టమైన విజువల్స్ కోసం 2000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్, అల్యూమినియం ఫ్రేమ్, IP68 రేటింగ్‌తో వస్తుంది. ఎక్కువకాలం మన్నికైనది. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ A16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం వినియోగించవచ్చు. కెమెరా ప్రియులు 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీలు, ఫేస్‌టైమ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉంది.