Amazon Festival Sale Offers : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!

Amazon Great Indian Festival Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 భారీ ధర తగ్గింపును పొందనుంది.

1/6
Amazon Great Indian Festival Sale 2025 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన అవకాశం. రెండేళ్ల క్రితం లాంచ్ అయిన ఐఫోన్ 15 భారీ తగ్గింపు ధరకే లభించనుంది. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభం కానుంది.
2/6
ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ ధర తగ్గింపు పొందవచ్చునని అమెజాన్ ధృవీకరించింది. ఆపిల్ ప్రీమియం ఐఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
అమెజాన్ ఐఫోన్ 15 ఆఫర్ : ఆపిల్ ఐఫోన్ 15 (128GB, బ్లాక్) అసలు ధర రూ.79,900కు పొందవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అమెజాన్ ధర రూ.45,249కి తగ్గనుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.34,651 సేవ్ చేసుకోవచ్చు.
4/6
అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియదు. అమెజాన్ ప్రస్తుతానికి ఆ వివరాలను రివీల్ చేయలేదు. ఫైనల్ ధర ఎంత ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
5/6
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 16, 17 సిరీస్‌లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్, డాల్బీ విజన్ సపోర్టుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది, ఇండోర్, అవుట్‌డోర్‌లలో స్పష్టమైన విజువల్స్ కోసం 2000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్, అల్యూమినియం ఫ్రేమ్, IP68 రేటింగ్‌తో వస్తుంది. ఎక్కువకాలం మన్నికైనది. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
6/6
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ A16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్‌ కోసం వినియోగించవచ్చు. కెమెరా ప్రియులు 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీలు, ఫేస్‌టైమ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉంది.