Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్ 13R కొనేసుకోండి.. ఈ కిర్రాక్ ఆఫర్ మీకోసమే..!
Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది. ఈ సేల్‌కు ముందే అన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ అమెజాన్ సేల్ వైడ్ రేంజ్ కేటగిరీలలో ఆకట్టుకునే ఆఫర్లు, ధరల తగ్గింపులను అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్‌లు తమకు ఇష్టమైన ప్రొడక్టులను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఎప్పటిలాగే, ఈసారి కూడా అమెజాన్ పండగ సేల్‌లో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌లపైనే భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఉండనున్నాయి. అందులో వన్ ప్లస్ ఫోన్లపై క్రేజీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. వన్‌ప్లస్ 13R ఫోన్ ఏకంగా రూ. 36వేల లోపు ధరకు లభ్యం కానుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 13R అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13R ఫోన్ రూ.42,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ.35,999 ధరకు అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0తో వస్తుంది.

ఇంకా, వన్‌ప్లస్ 13R ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP65 సర్టిఫికేషన్‌తో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13R ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా కూడా ఉంది.