Teja Sajja: 160వ స్థానం నుంచి టాప్ 10 లోకి.. తేజ సజ్జా రేర్ ఫీట్.. టాప్ స్టార్స్ ను వెనక్కి నెట్టి మరీ!

మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja). సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Teja Sajja: 160వ స్థానం నుంచి టాప్ 10 లోకి.. తేజ సజ్జా రేర్ ఫీట్.. టాప్ స్టార్స్ ను వెనక్కి నెట్టి మరీ!

Teja Sajja ranks 9th on IMDB's Most Popular Indian Celebrities list

Updated On : September 18, 2025 / 9:24 PM IST

Teja Sajja: మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ సక్సెస్ సాధించింది. ఈ నేపధ్యంలోనే హీరో తేజ సజ్జా అరుదైన రికార్డ్ ను సాధించాడు. ఈ వారానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో ఐఎండిపీలో ఇండియా వైడ్ గా 9వ స్థానాన్ని సాధించాడు. గత వారం ఈ రెంటింగ్స్ లో 160వ స్థానంలో ఉన్న తేజ సజ్జా ఈవారం ఏకంగా 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వారం తేజ నటించిన మిరాయ్ రిలీజ్ అవడం వల్ల ఈ రికార్డ్ సాధించాడు తేజ(Teja Sajja).

Prabhas-Abhishek: ప్రభాస్ మూవీలో అభిషేక్.. క్రేజీ ప్రాజెక్టులో కీ రోల్.. ఇంతకీ ఏ సినిమా కోసమో తెలుసా?

ఇక ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో బాలీవుడ్ యంగ్ హీరో అహన్ పాండే ఉన్నాడు. ఈ హీరో నటించిన సయారా భారీ విజయం సాధించిన నేపధ్యంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక మూడో స్థానంలో అనీత్ పడ్డ నిలిచారు. ఇతను కూడా సయారా మూవీ బజ్ కారణంగా టాప్ 3 రేటింగ్ ను దక్కించుకున్నాడు. ఇక జాలి ఎల్.ఎల్.బి 3 మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ ఆరవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఇక తేజ సజ్జా విషయానికి వస్తే, ప్రెజెంట్ మిరాయ్ సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ కుర్ర హీరో.. త్వరలోనే తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. అదే జాంబీ రెడ్డి 2. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన జాంబీ రెడ్డి సినిమాకు ఇది సీక్వెల్. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను కూడా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది.