Flipkart Big Billion Days Sale : సూపర్ డీల్ భయ్యా.. గూగుల్ పిక్సెల్ 9పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోవచ్చు..!
Flipkart Big Billion Days Sale : గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తగ్గింపు ధరకే ఇలా కొనేసుకోవచ్చు.

Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 వచ్చేస్తోంది. ఈ సేల్ ఈవెంట్ సెప్టెంబర్ 23న మొదలు కానుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోం అప్లియన్సెస్, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లతో సహా వైడ్ రేంజ్ కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందించనుంది. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా చాలా స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇప్పటికే వెల్లడించింది.

అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో ఇదొకటి. గూగుల్ పిక్సెల్ 9 ధర భారీ తగ్గింపు పొందింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో పిక్సెల్ 9 రూ. 35వేల లోపు ధరకు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ధరకు పిక్సెల్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఇదో అద్భుతమైన అవకాశం.

గూగుల్ పిక్సెల్ 9 ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రారంభ ధర రూ.79,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ 9 ఫోన్ రూ.34,999 ధరకు అందుబాటులో ఉంటుంది.

పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 1080 x 2424 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్ కలిగి ఉంది.

అలాగే, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. పిక్సెల్ 9లో టెన్సర్ G4 ప్రాసెసర్ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగి ఉన్నాయి.

ఇంకా, ఈ పిక్సెల్ 9 ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9లో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఉంది.

OISతో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ పిక్సెల్ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా కలిగి ఉంది.