Site icon 10TV Telugu

Vijay Devarakonda: గ్లోబల్ స్టార్‌కు రౌడీ స్టార్ థ్యాంక్స్.. ఎందుకంటే..?

Vijay Devarakonda Thanks Ram Charan For This Element

Vijay Devarakonda Thanks Ram Charan For This Element

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటుండటంతో ప్రేక్షకులు, అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ‘ది విజయ్ దేవరకొండ’ అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు ఈ హీరోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ హీరో కూడా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు.

Vijay devarakonda : బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ.. ఈ సారైనా హిట్ కొడతాడా?

తనకంటూ ప్రత్యేక ఇమేజ్, ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండకు స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో పలువురు స్టార్స్ కూడా ఆయనకు తమ విషెస్ చెబుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా విజయ్ దేవరకొండకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండకు మెగా పవర్ స్టార్ తన విషెస్ చెబుతూ గ్రీట్ చేశాడు. విజయ్ అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో తమ అభిమాన హీరో బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేయడం నిజంగా అభినందనీయం అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు చరణ్.

Vijay Devarakonda : బర్త్‌డే స్పెషల్ ట్రీట్ ఇస్తున్న విజయ్ దేవరకొండ.. అందరికి ఐస్ క్రీం ఫ్రీ..

ఈ ట్వీట్‌కు విజయ్ ‘థ్యాంక్యు అన్నా.. వారు ఎల్లప్పుడే నన్ను సంతోషపెట్టడమే కాకుండా గర్వించేలా చేస్తున్నారు..’’ అంటూ పేర్కొన్నాడు. ఇలా ఇద్దరు క్రేజీ స్టార్‌డమ్ ఉన్న హీరోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ రౌడీ స్టార్ ప్రస్తుతం సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘ఖుషి’ మూవీలో నటిస్తున్నాడు.

Exit mobile version