బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ తో..విజయ్ దేవరకొండ

  • Publish Date - April 1, 2019 / 09:20 AM IST

టాలివుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఆరు నెలలకోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ప్లాన్ వేశాడు. ముచ్చటగా మూడు సినిమాల్ని లైన్లో పెట్టిన రౌడీ టాలివుడ్ తో పాటు కోలివుడ్ కూడా నాదే అంటున్నాడు. అంతేకాదు రొటీన్ మూవీస్ కి భిన్నంగా సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ దూసుపోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిలో అగ్రెసివ్ గా కనిపిస్తే గీత గోవిందంలో ఫ్యామిలీ మెన్ లా సాఫ్ట్ గా కనిపించాడు.

ఆ తర్వాత టాక్సీవాలాలో కామెడీ పండించి ఫన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు డియర్ కామ్రెడ్ లో మరోసారి తనలోని యాంగ్రీ యంగ్ మెన్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడు. భరత్ కమ్మ డైరెక్షన్ లో రాబోతున్న డియర్ కామ్రెడ్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. డియర్ కామ్రెడ్ ఇంకా పూర్తికాకముందే.. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని పట్టాలెక్కించాడు. క్రాంతి మాధవ్ సినిమాలో.. ఏకంగా నలుగురు హీరోయిన్స్.. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్, బ్రెజిల్ మోడల్ ఇజబెల్లెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలివుడ్, కోలివుడ్ రెండు ఫిల్మ్ ఇండస్ట్రీస్ పై ఫోకస్ పెట్టాడు. అందుకే తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు రెండు భాషల్లోనూ కనిపించేలా బైలింగ్వల్ సినిమాలకి ఓటేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ అన్నామలై దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టాక్సీవాలా సినిమాని కార్ థీమ్ తో తెరకెక్కిస్తే.. ఈ మూవీ బైక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. విజయ్ దేవరకొండ నటించిన ఫస్ట్ బైలింగ్వల్ మూవీ నోటా, తెలుగులో ఆడకపోయినా తమిళ్ లో మంచి రెస్పాన్సే వచ్చింది. మొత్తానికి రౌడీ ఈసారి బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలతో సిద్దమవుతున్నాడు.