Vijay Deverakonda : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ, సమంత (Samantha) నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ శుక్రవారం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ.. నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ ఇంటరాక్షన్ లో తన ఫేవరెట్ మూవీ, సీన్, జోనర్ గురించి మాట్లాడాడు.
Vijay Deverakonda : సందీప్ వంగతో మరో సినిమా చేస్తా.. అలాగే తమిళ్ డైరెక్టర్స్..
గ్లాడియేటర్ మూవీ అంటే తనకి బాగా ఇష్టమంట. అలాగే సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ పై తన చాలా ఇంటరెస్ట్ అని, అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ దర్శకులకు, రచయితలకు హింట్ ఇచ్చాడు. ఇక తనకి ఇలాంటి ఒక పాత్రలో నటించాలి అని ఏదైనా డ్రీం క్యారెక్టర్ ఉందా..? అని ప్రశ్నించగా, విజయ్ బదులిస్తూ.. “అలా ఒక డ్రీమ్ క్యారెక్టర్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ అంటే చాలా ఇష్టం. అలాంటి ఒక ఇంట్రో ఎప్పటికైనా నా మూవీలో కూడా పెట్టుకోవాలని డ్రీం ఉంది. అదెప్పుడు కుదురుతుందో చూడాలి” అంటూ పేర్కొన్నాడు.
Vijay Deverakonda : నటనకు విరామం ఇచ్చి.. డైరెక్షన్ చేస్తా.. అలాగే బిజినెస్ కూడా..
ఇక ఫ్యాన్స్ తన ఫోటోని ఆర్ట్ గా గీసి తనకి బహుమతులుగా పంపిస్తున్న దానిపై రియాక్ట్ అవుతూ.. “నా ఫొటోస్ ని ఆర్ట్‌లో చూడటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి నాకు అలా బహుమతులు పంపడం మానేయండి. మీరు వేరే ఏ బొమ్మ గీసి ఇచ్చినా తీసుకుంటా” అంటూ వెల్లడించాడు. ఇక ఖుషి తరువాత నటిస్తున్న VD12, VD13 సినిమాలు గురించి మాట్లాడుతూ.. “ఆ మూవీ స్క్రిప్ట్స్ సూపర్ గా ఉంటాయి. అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తాని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా VD12 చిత్రాన్ని ‘జెర్సీ’ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, VD13ని పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు.