ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ – విజయ్ దేవరకొండ
లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14 విడుదల..

Vijay Deverakonda About World Famous Lover 25416
లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14 విడుదల..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి హృద్యమైన సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ కాంబినేషన్లో, సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover)..
రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఎజబెల్లా, క్యాథరీన్ కథానాయికలు..ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే నాలుగు మిలియన్లకి పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా గురించి విజయ్ మాట్లాడుతూ : ‘‘విజయ్ దేవరకొండ సినిమా అంటే హడావిడి, ఎగ్జైట్‌మెంట్ ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్‌లో ఒక ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్‌లో ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. వీడితో నలుగురు హీరోయిన్లు ఎందుకు చేస్తున్నారని ఎగ్జిబిటర్స్‌లో, డిస్ట్రిబ్యూటర్స్‌లో ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది.
నాలుగు రెట్లు రిటర్న్స్ ఇస్తారనుకుంటూ ఉంటారు. ఈసారి నేనేం చెయ్యలేదు. నేను చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమాలోనే ఎక్కువ కష్టపడ్డా. అందరం చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ట్రైలర్ లాంచ్ చేశాం. ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్ అయింది. నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్‌గా లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా.
ఇది చేసేటప్పుడే నాకు తెలుసు.. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవబోతోందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో నలుగురు బ్యూటిఫుల్ విమెన్స్‌తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఇది కల నిజమవడం లాంటిది. నలుగురూ తమ నటనతో చంపేశారు. నా లాస్ట్ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. అన్ని రకాల ప్రేమ నింపి ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు క్రాంతిమాధవ్. ఫిబ్రవరి 14న ఈ కంప్లీట్ ప్యాకేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ 47వ చిత్రం బిగ్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. క్రాంతిమాధవ్‌కు ఈ సినిమాతో అతిపెద్ద సక్సెస్ రావాలని ఆశిస్తున్నా’’ అన్నారు.