PM Modi : పీఎం మోదీతో విజయ్ దేవరకొండ, మై హోమ్ గ్రూప్ చైర్మన్.. ఫొటో వైరల్..

ఓ నేషనల్ మీడియా ఏర్పాటు చేసిన సమ్మిట్ లో మన ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని అనేక అంశాలపై మాట్లాడారు.

Vijay Deverakonda and My Home Jupally Rameswar Rao Meets PM Modi in National Media Summit

PM Modi : నేడు ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ మీడియా ఏర్పాటు చేసిన సమ్మిట్ లో మన ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని అనేక అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు రామ్, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ యామి గౌతమ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read : Ram Charan – Dhansuh : వాట్.. రామ్ చరణ్ – ధనుష్ సినిమా..? తమిళ్ – తెలుగు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రాబోతోందా?

కార్యక్రమం అనంతరం వీరంతా కలిసి పీఎం మోదీని కలిశారు. మోదీ వీరితో ముచ్చటించారు. విజయ్ దేవరకొండ, మై హోమ్ రామేశ్వరరావు, యామి గౌతమ్, పుల్లెల గోపీచంద్.. పలువురు కలిసి పీఎం మోదీతో ఫొటో దిగారు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక విజయ్ దేవరకొండ మోదీ పాల్గొన్న సభలో పాల్గొనటం, మోదీతో ఫొటో దిగడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో విజయ్ కింగ్ డమ్ లుక్స్ లో ఉన్నాడు.