Ram Charan – Dhansuh : వాట్.. రామ్ చరణ్ – ధనుష్ సినిమా..? తమిళ్ – తెలుగు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రాబోతోందా?
తాజాగా అలాంటి క్రేజీ కాంబోలో ఓ సినిమా రాబోతుందని అన్ని ఇండస్ట్రీల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Dhanush and Ram Charan will Do Huge Multi starrer under Dhanush Direction
Ram Charan – Dhansuh : పాన్ ఇండియా పుణ్యమా అని హైవోల్టేజ్ క్రేజీ కాంబోలో సెట్ అవుతున్నాయి. భాషల బార్డర్స్ చెరిగిపోయి క్రేజీ కాంబోలు సెట్ అవుతున్నాయి. RRR తో ఎన్టీఆర్ – రామ్ చరణ్ అదరగొట్టగా ఇప్పుడు అన్ని భాషల్లో స్టార్ హీరోలు మల్టీస్టారర్ లు, వేరే హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తున్నారు. వేరే సినీ పరిశ్రమల హీరోలను కూడా తెచ్చి సినిమాలు చేస్తున్నారు. సలార్, కూలి, కుబేర, జైలర్.. ఇలా అనేక సినిమాల్లో వేరు వేరు పరిశ్రమల స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు.
తాజాగా అలాంటి క్రేజీ కాంబోలో ఓ సినిమా రాబోతుందని అన్ని ఇండస్ట్రీల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా సినిమాలు చేస్తునే మరో వైపు సింగర్‌గా, లిరిసిస్ట్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా కూడా బిజీగా ఉన్నారు.
Also Read : Allu Arjun – SKN : అల్లు అర్జున్ తో 22 ఏళ్ళ క్రితం దిగిన ఫోటో షేర్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఫొటో వైరల్..
ధనుష్ డైరెక్ట్ చేసిన ప పాండి, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాయి. ప్రస్తుతం ఇడ్లీ కడై సినిమాను డైరెక్షన్ చేస్తున్నాడు ధనుష్. అయితే ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ సర్కిల్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ధనుష్ ఈసారి టాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నాడని ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కు ఓ మాస్ సబ్జెక్ట్ లైన్ చెప్పాడంట ధనుష్. ఆ లైన్ చరణ్ కి కూడా తెగ నచ్చేసిందట. ప్రస్తుతం చరణ్ బుచ్చి బాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత ధనుష్ ప్రాజెక్ట్‌ను సెట్‌మీదకు తీసుకువెళ్తారంటూ లెక్కలు కూడా వేస్తున్నారు. పెద్ది సినిమాను కూడా తమిళ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్.. ధనుష్ మాస్ కాంబో నిజమైతే మాత్రం కోలీవుడ్, టాలీవుడ్ బాక్సాఫిస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.