Allu Arjun – SKN : అల్లు అర్జున్ తో 22 ఏళ్ళ క్రితం దిగిన ఫోటో షేర్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఫొటో వైరల్..

ఐకాన్‌స్టార్‌ నటుడిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

Allu Arjun – SKN : అల్లు అర్జున్ తో 22 ఏళ్ళ క్రితం దిగిన ఫోటో షేర్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఫొటో వైరల్..

Producer SKN Shares 22 Years Back Photo with Allu Arjun on Special Day

Updated On : March 28, 2025 / 9:35 PM IST

Allu Arjun- SKN : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. పుష్ప 2 సినిమాతో బాహుబలి రికార్డులు సైతం బద్దలుకొట్టి నేషనల్ వైడ్ స్టార్ డమ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సాధించాడు. బన్నీ నెక్స్ట్ సినిమాల కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. అయితే అల్లు అర్జున్ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి నేటికి 22 ఏళ్ళు అయింది. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి విడుదలై నేటికి 22 ఏళ్లు. ఐకాన్‌స్టార్‌ నటుడిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

దీంతో నేడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గంగోత్రిలో అమాయక యువకుడి పాత్రతో మొదలై నేడు నేషనల్ అవార్డు సాధించిన స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత SKN స్పెషల్ పోస్ట్ షేర్ చేసాడు.

Also Read : Kavya Maran : SRH కావ్య పాప.. ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందా? క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ టీమ్..

మెగా అభిమానిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మేనేజర్ గా, జర్నలిస్ట్ గా, గీత ఆర్ట్స్ లో పనిచేస్తూ ఇప్పుడు నిర్మాత స్థాయికి ఎదిగాడు SKN. అల్లు అర్జున్ తో SKN కి మంచి అనుబంధం ఉంది. ఇక సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో ఇటీవల బాగా వైరల్ అయ్యాడు. సినీ కెరీర్ ఆరంభంలో అల్లు అర్జున్ SKN కి చాలా సపోర్ట్ చేసాడు. తాజాగా అల్లు అర్జున్ 22 ఏళ్ళు కెరీర్ పూర్తిచేసినందుకు బన్నీతో 22 ఏళ్ళ క్రితం దిగిన ఫోటోని షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ చేసాడు నిర్మాత SKN.

Producer SKN Shares 22 Years Back Photo with Allu Arjun on Special Day

Also Read : David Warner : నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాకు సీక్వెల్.. డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ గా.. టైటిల్ ఏంటంటే..?

అల్లు అర్జున్ తో 22 ఏళ్ళ క్రితం ఫొటో, రీసెంట్ గా దిగిన ఫోటోలు షేర్ చేసి.. 22 ఏళ్ళ క్రితం, ఇప్పుడు. ఇతను ఆల్ రౌండర్. ఇతను బాల్ ని కొడితే బౌండరీలు ఉండవు. ఇతని ప్యాషన్, ఇతని హార్డ్ వర్క్, ట్యాలెంట్ అద్భుతాలు కియేట్ చేస్తాయి. AA అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్. ఇతని జర్నీ నుంచి ప్రేరణ పొందాను. ఐకాన్ స్టార్ మరిన్ని మైల్ స్టోన్స్, అచివ్మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వగా 22 ఏళ్ళ క్రితం అల్లు అర్జున్, SKN ఎలా ఉన్నారో చూడండి అంటూ ఫొటో వైరల్ గా మారింది.