David Warner : నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాకు సీక్వెల్.. డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ గా.. టైటిల్ ఏంటంటే..?
రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వచ్చి ఓ రెండు నిముషాలు నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు.

David Warner will be Main Villain in Nithiin Robinhood Sequel
David Warner : నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ సినిమా నేడు మార్చ్ 28 న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ చిన్న పాత్ర పోషించాడు. తెలుగు సినిమాల సాంగ్స్, డైలాగ్స్ రీల్స్ తో తెలుగు వాళ్లకు దగ్గరైన డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
సినిమాలో డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వచ్చి ఓ రెండు నిముషాలు నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఇది కేవలం ఆ పాత్ర ఇంట్రడక్షన్ లా ఉంటుంది. దీంతో ఇంతేనా అని డేవిడ్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. అయితే సినిమా చివర్లో డేవిడ్ వార్నర్ ని చూపిస్తూనే రాబిన్ హుడ్ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించారు. ఆ సీక్వెల్ కి ‘బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్’ అనే టైటిల్ కూడా ప్రకటించడం గమనార్హం.
Also Read : Venkatesh : ఆ సమస్యతో బాధపడుతున్న వెంకీమామ.. కొన్ని రోజులు రెస్ట్ తప్పనిసరి అన్న డాక్టర్లు..
ఆ సీక్వెల్ లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ అని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ – డేవిడ్ వార్నర్ కి ఫేస్ టు ఫేస్ సీన్స్ లేవు. సీక్వెల్ లో ఈ ఇద్దరి మధ్యే పోరు ఉండనుంది. ప్రస్తుతానికి రాబిన్ హుడ్ సినిమా రిజల్ట్ యావరేజ్ అని వినిపిస్తుంది. మరి సీక్వెల్ తీస్తారా? డేవిడ్ వార్నర్ ని విలన్ గా చూపిస్తారా చూడాలి.