Venkatesh : ఆ సమస్యతో బాధపడుతున్న వెంకీమామ.. కొన్ని రోజులు రెస్ట్ తప్పనిసరి అన్న డాక్టర్లు..
ప్రస్తుతానికి వెంకటేష్ కొన్ని కథలు వింటున్నారని, ఏది ఫైనల్ అవ్వలేదని సమాచారం.

Venkatesh Effected with Knee Issues and Take Rest for Some Days
Venkatesh : సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఇటీవల సంక్రాతికి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ సాధించి ఫ్యామిలీ సినిమాలతో, రీజనల్ సినిమాలతో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించొచ్చు అని సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు వెంకీమామ. దీంతో నెక్స్ట్ వెంకటేష్ ఏ సినిమాతో వస్తాడో అని ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతానికి వెంకటేష్ కొన్ని కథలు వింటున్నారని, ఏది ఫైనల్ అవ్వలేదని సమాచారం. తరుణ్ భాస్కర్ తో పాటు కొంతమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవ్వరికి ఫైనల్ కమిట్మెంట్ ఇవ్వలేదట. అయితే తాజాగా వెంకటేష్ మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నాడని సమాచారం.
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం కొన్ని రోజులుగా వెంకటేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, డాక్టర్స్ కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారట. దీంతో ప్రస్తుతం వెంకీమామ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారట. సమ్మర్ అయ్యేంతవరకు రెస్ట్ తీసుకొని మే తర్వాత ఫ్రెష్ గా కొత్త సినిమా పని చూస్తారని వెంకటేష్ సన్నిహితులు అంటున్నారు. దీంతో వెంకీమామ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.