Kavya Maran : SRH కావ్య పాప.. ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందా? క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ టీమ్..
ఈ అందమైన సీఈఓ ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

Kavya Maran Relationship with Star Music Director Rumors goes Viral
Kavya Maran : ఐపీఎల్‌ను ఫాలో అయ్యేవారికి కావ్యా మారన్ గురించి చెప్పాల్సిన పని లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ అయిన కావ్యా ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరు అవుతుంది. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూతురైన కావ్యామారన్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకు యజమాని అయిన తర్వాతే ఎక్కువ పాపులర్ అయింది. కావ్యామారన్ తన టీమ్ ఆడుతున్నప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కోసం చాలామంది మ్యాచ్ చూస్తారు. ఇక కెమెరా కూడా కావ్య ఎక్కడుంటే అక్కడ ఫోకస్ పెడుతుంది.
అయితే ఈ అందమైన సీఈఓ ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కావ్య SRH టీమ్ అయినా ఆమెది తమిళనాడే. కావ్య తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తో డేటింగ్ చేస్తుందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. గతంలో పలుమార్లు ఈ ఇద్దరూ కలిసి కనిపించారు కూడా. అయితే తాజాగా అనిరుద్ టీమ్ దీనిపై స్పందిస్తూ.. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తెలిపారు.
Also Read : David Warner : నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాకు సీక్వెల్.. డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ గా.. టైటిల్ ఏంటంటే..?
కావ్య పాపకు తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అనిరుద్ తో డేటింగ్ లో ఉందని తెలిసి కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ అనిరుద్ టీమ్ ఆ వార్తలు అవాస్తవం అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో కావ్య ని చూసిన ఫ్యాన్స్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.