Vijay-Rashmika Marriage: విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్.. ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్..

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న(Vijay-Rashmika Marriage) త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

Vijay-Rashmika Marriage: విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్.. ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్..

Vijay Deverakonda and Rashmika Mandanna getting married in February.

Updated On : December 30, 2025 / 7:38 AM IST

Vijay-Rashmika Marriage: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గత కొన్నేళ్లుగా రిలేషన్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆ రిలేషన్ ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తు అక్టోబర్ లో విజయ్ – రష్మిక సింపుల్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ ఎంగేజ్ మెంట్ గురించి విజయ్, రష్మిక ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ, ఆడియన్స్ మాత్రం వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత రెండు రోజులో విజయ్- రష్మిక(Vijay-Rashmika Marriage)ల పెళ్లి డేట్ ఇదే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Naga Vamsi; అన్నిట్లో వేలు పెట్టొద్దు.. ఆ జానర్ మిస్ చేయొద్దు.. త్రివిక్రమ్ క్లాస్ పీకాడట..

ఆ వార్తల ప్రకారం 2026 ఫిబ్రవరి 26న విజయ్- రష్మికల పెళ్లి ఘనంగా జరుగనుందట. ఇందుకోసం ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గానే ఈ పెళ్లి డేట్ ను ఇరు కుటుంబ సభ్యులు ఫైనల్ చేశారట. అయితే, ఈ పెళ్ళి వేడుకకి ఇండస్ట్రీ నుంచి తక్కువమందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారట. పెళ్లి తరువాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉంటుందని టాక్. త్వరలోనే ఈ పెళ్లి డేట్ పై అధికారిక ప్రకటన రానుంది.