Rashmika Vijay
Rashmika Vijay : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల కొన్ని రోజుల క్రితం వీరు నిశ్చితార్థం చేసుకున్నారు అని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిశ్చితార్థంకు సంబంధించి ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయలేదు. ఎక్కడా మాట్లాడలేదు ఈ ఇద్దరూ. విజయ్, రష్మిక ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు.(Rashmika Vijay)
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇటీవల రిలీజయి ఒక సెక్షన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపిస్తుంది. రష్మిక కూడా సినిమా రిలీజ్ కి ముందు, రిలీజ్ సమయంలో కూడా ప్రమోషన్స్ కి రాలేదు. ఎక్కడా కనపడలేదు. మైసా షూట్ తో కేరళలో బిజీగా ఉంది రష్మిక.
ఎట్టకేలకు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ కి రాబోతుంది. గర్ల్ ఫ్రెండ్ కోసం రష్మిక బాయ్ ఫ్రెండ్ కూడా రాబోతున్నాడు. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో రేపు నవంబర్ 12న సాయంత్రం 6 గంటల నుంచి ఓ స్టార్ హోటల్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాబోతున్నాడు.
నిశ్చితార్థం తర్వాత మొదటిసారి రష్మిక – విజయ్ కలిసి కనిపించబోతున్నారు అని తెలియడంతో ఈ జంట ఫ్యాన్స్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ జంట రేపు సినిమా గురించే కాక, తమ నిశ్చితార్థం, పెళ్లి గురించి మాట్లాడతారా చూడాలి.
Also Read : Shruti Haasan : మహేష్ బాబు కోసం శృతి హాసన్ ని తీసుకొచ్చిన రాజమౌళి.. SSMB29 ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..