Shruti Haasan : మహేష్ బాబు కోసం శృతి హాసన్ ని తీసుకొచ్చిన రాజమౌళి.. SSMB29 ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..
తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది శృతిహాసన్.(Shruti Haasan)
Shruti Haasan
Shruti Haasan : మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 15 న గ్రాండ్ గా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం, సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ రోజు టైటిల్ లాంచ్ వీడియో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది శృతిహాసన్.(Shruti Haasan)
శృతి హాసన్ కీరవాణిని కలిసిన ఫోటోలు షేర్ చేసి.. కీరవాణి సర్ మ్యూజిక్ లో పాడటం ఆనందంగా ఉంది. ట్రాక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. గ్లోబ్ ట్రాటర్ అదిరిపోతుంది. నేను సైలెంట్ గా కూర్చొని సర్ మ్యూజిక్ వింటున్నాను. ఆయన సాధారణంగా విఘ్నేశ్వర మంత్రంతో ఏదైనా మొదలుపెడతారు. ఆయన కీ బోర్డు ప్లే చేసినప్పుడు నేను అదే అనుకున్నాను. సడెన్ గా నేను రియలైజ్ అయ్యాను అది నాన్న సాంగ్. ఆ మూమెంట్ నాకు చాలా స్పెషల్. థాంక్యూ సర్. గ్లోబ్ ట్రాటర్ మీరంతా వినడానికి ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసింది.
రాజమౌళి – మహేష్ సినిమా గ్లోబ్ ట్రాటర్ అంటూ వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ పాడింది. రిలీజ్ చేసే టైటిల్ బ్యాక్ గ్రౌండ్ లో శృతి హాసన్ వాయిస్ ఉండబోతుందని తెలుస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ మాత్రమే కాదు సింగర్, డ్యాన్సర్, మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిందే. అలాగే శృతి హాసన్ – మహేష్ బాబు కలిసి శ్రీమంతుడు సినిమాలో నటించారు. మొత్తానికి రాజమౌళి ఏదో భారీగానే ప్లాన్ చేసాడు అని అంటున్నారు. ఆల్రెడీ శృతి వాయిస్ తో సంచారి.. అనే ఒక సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Also Read : Suma Rajeev Kanakala : సుమ ఇక్కడ ప్రగ్నెన్సీతో.. అక్కడ రాజీవ్ కనకాల కాలు విరిగి.. సుమకు ఆ విషయంలో భయం..
