Suma Kanakala : కార్ లో ఏడ్చేసా.. నేనేమైనా రోబోనా.. నాన్న చనిపోయిన మూడో రోజే షూటింగ్ కి.. కూతురికి జ్వరం వస్తే కూడా..
ఈ క్రమంలో తన బిజీ లైఫ్ గురించి, ఖాళీ లేకుండా ఎలా కష్టపడింది అని చెప్తూ ఎమోషనల్ అయింది. (Suma Kanakala)
Suma Kanakala
Suma Kanakala : స్టార్ యాంకర్ సుమ కనకాల తెలుగు ప్రేక్షకులను రెగ్యులర్ గా తన యాంకరింగ్ తో ఎన్నో ఏళ్లుగా మెప్పిస్తునే ఉంది. అనేక టీవీ షోలతో అలరించిన సుమ ప్రస్తుతం ఓ టీవీ షో, యూట్యూబ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అలరిస్తుంది. యాంకర్ సుమ చాలా రోజుల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.(Suma Kanakala)
ఈ ఇంటర్వ్యూలో సుమ అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తన బిజీ లైఫ్ గురించి, ఖాళీ లేకుండా ఎలా కష్టపడింది అని చెప్తూ ఎమోషనల్ అయింది.
Also Read : Suma Rajeev Kanakala : సుమ ఇక్కడ ప్రగ్నెన్సీతో.. అక్కడ రాజీవ్ కనకాల కాలు విరిగి.. సుమకు ఆ విషయంలో భయం..
సుమ కనకాల మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నేను ఫుల్ బిజీ. ఉదయం 5కి లెగిస్తే రాత్రి ఒంటిగంటకి పడుకునేదాన్ని. షూటింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, నెలకు 54 ఎపిసోడ్స్ షూటింగ్ చేసేదాన్ని. పిల్లలతో ఫోన్ లోనే మాట్లాడేదాన్ని. అప్పుడప్పుడు షూటింగ్ సెట్ కి పిలిపించి వాళ్ళతో హోమ్ వర్క్స్ చేయించేదాన్ని. ఒక రోజు రామోజీ ఫిలింసిటీకి షూటింగ్ కి వెళ్ళేటప్పుడు కార్ లో కూర్చొని ఏడ్చేసాను. ఫుల్ బాడీ పెయిన్స్, కాళ్ళు నొప్పులు. నేనేమైనా రోబో నా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాను అనిపించేది.
ఒకసారి నాన్న చనిపోయిన మూడో రోజే షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎపిసోడ్స్ బ్యాకప్ లేవు. ప్రొడక్షన్ కూడా నాదే. దాంతో తప్పలేదు. నా కూతురుకు జ్వరం వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొచ్చి స్టేజ్ పక్కన పడుకోబెట్టేదాన్ని. గ్యాప్ గ్యాప్ లో వెళ్లి తనని చూసుకునేదాన్ని. ఒక్కోసారి షూటింగ్ కి తీసుకొచ్చి రూమ్ లో పడుకోబెట్టుకునేదాన్ని. పిల్లలకు హెల్త్ బాగోకపోయినా వాళ్ళని వదిలేసి షూట్ కి రావాలి. అది చాలా బాధగా ఉంటుంది ఒక తల్లికి అంటూ ఎమోషనల్ అయింది.
Also Read : NTR : తెల్లారితే ఎన్టీఆర్ ముందు డ్యాన్స్ చేయాలి.. కానీ వీల్ చైర్ లో రాజు.. ఎన్టీఆర్ ఏమన్నాడంటే..
అలాగే స్టార్ మహిళ షో గురించి కూడా మాట్లాడుతూ.. వెయ్యి ఎపిసోడ్స్ అయ్యాక నాకు చిరాకు వచ్చేసింది. ఇంక ఈ షో వదిలేయాలి. ఈ షో ఆపేయాలి అనిపించింది చాలా సార్లు. రొటీన్ షో అయిపొయింది. రోజుకు అయిదు ఎపిసోడ్స్, ముప్పై మందిని ఎంటర్టైన్ చేయాలి. రోజూ ఒకే ఫార్మేట్ నాకేమో చిరాకు వచ్చేది. ప్రతి ఎపిసోడ్ కి కొత్తగా వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్లకు ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇంక ఆపేద్దాం ఆ షో అనుకున్నాను. కానీ జనాల్ని ఎంటర్టైన్ చేయడం మానేసి నేను ఎంటర్టైన్ అవ్వడం మొదలుపెట్టాను. అప్పట్నుంచి కంటిన్యూ చేసి 5000 ఎపిసోడ్స్ చేశాను అని తెలిపింది.
