New Directors : అప్పట్లో దర్శకుల కొడుకులు హీరోలుగా.. ఇప్పుడు హీరోల కొడుకులు దర్శకులుగా.. ట్రెండ్ మారింది గురూ..

అన్ని సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.(New Directors)

New Directors : అప్పట్లో దర్శకుల కొడుకులు హీరోలుగా.. ఇప్పుడు హీరోల కొడుకులు దర్శకులుగా.. ట్రెండ్ మారింది గురూ..

New Directors

Updated On : November 11, 2025 / 9:58 AM IST

New Directors : సినీ పరిశ్రమలో నెపోటిజం చాలా సర్వసాధారణం. ఒక ఫ్యామిలీ నుంచి అన్ని వివిధ క్రాఫ్ట్స్ లోకి వస్తూనే ఉంటారు. ముఖ్యంగా హీరోలు అవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. గతంలో చాలా మంది దర్శకుల, నిర్మాతల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి అన్ని సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.(New Directors)

రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్, పంకజ్ కపూర్ తనయుడు షాహిద్ కపూర్, దాసరి నారాయణ తనయుడు అరుణ్, పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి, MS రాజు కొడుకు సుమంత్ అశ్విన్, రాజేంద్రన్ కొడుకు శింబు, ఫాజిల్ కొడుకు ఫహద్ ఫాజిల్.. ఇలా అన్ని పరిశ్రమలలో చాలా మంది దర్శకుల తనయులు హీరోలు అయ్యారు. హీరోల కొడుకులు హీరోలు అవ్వడం చాలా కామన్. అప్పుడపుడు దర్శకుల తనయులు ఇలా హీరోలు అవుతారు.

Also Read : Dharmendra : బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర మరణించారంటూ వార్తలు.. మా నాన్న బతికే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చిన కూతురు..

తాజాగా ట్రెండ్ మారింది. హీరోల కొడుకులు దర్శకులు అవుతున్నారు. హిందీ, తెలుగు, తమిళ్.. ఇలా అన్ని పరిశ్రమలలోని ఈ ట్రెండ్ నడుస్తుంది. బాలీవుడ్ లో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇటీవలే బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే సిరీస్ తో దర్శకుడిగా మారాడు. తమిళ్ లో విజయ్ కొడుకు జాన్సన్ విజయ్ సిగ్మా సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇక తెలుగులో రవితేజ కొడుకు మహాధన్ దర్శకుడు అవుతాడు అని సమాచారం. మహాధన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి – సూర్య సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడు.

ఇలా అన్ని పరిశ్రమలలో పలువురు హీరోల తనయులు దర్శకులుగా మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోపక్క దర్శకుల తనయులు కూడా దర్శకులు అవ్వడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ కొడుకు సందీప్ రెడ్డి వంగ దగ్గర స్పిరిట్ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడు.

Also Read : RGV : అప్పటిదాకా నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను.. ఆర్జీవీ పంతం.. అయినట్టే ఇక..