Dharmendra : బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర మరణించారంటూ వార్తలు.. మా నాన్న బతికే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చిన కూతురు..
బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర నేడు మరణించారని వార్తలు వచ్చాయి. (Dharmendra)
Dharmendra
Dharmendra : బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర నేడు మరణించారని వార్తలు వచ్చాయి. గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నేడు ఉదయం ఆయన మరణించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో హిందీ పరిశ్రమ, దేశవ్యాప్తంగా ధర్మేంద్రకు నివాళులు అర్పిస్తున్నారు.
అయితే తాజాగా ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు ఈషా డియోల్ స్పందించింది. ఈషా డియోల్ తన సోషల్ మీడియాలో.. మీడియా మరీ ఫాస్ట్ గా ఉంది. తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తున్నట్లు కనిపిస్తోంది. మా నాన్న స్థిరంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. మా కుటుంబ గోప్యతను ప్రతి ఒక్కరూ ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా నాన్న కోలుకోవాలని చేసే ప్రార్థనలకు ధన్యవాదాలు అని తెలిపింది.
Also Read : RGV : అప్పటిదాకా నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను.. ఆర్జీవీ పంతం.. అయినట్టే ఇక..
View this post on Instagram
దీంతో ధర్మేంద్ర ఇంకా మరణించలేదని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలుస్తుంది.
