RGV : అప్పటిదాకా నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను.. ఆర్జీవీ పంతం.. అయినట్టే ఇక..
ఆర్జీవీ - నాగార్జున కాంబోలో వచ్చిన క్లాసిక్ సినిమా శివ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. (RGV)
RGV
RGV : నాగార్జున హీరోగా శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. అప్పట్లో శివ సినిమా భారీ విజయం సాధించడమే కాక సాంకేతికంగా కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది తెలుగు సినీ పరిశ్రమలో. శివ సినిమా తర్వాత ఆర్జీవీ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ ఎవర్ని లెక్కచేసినా చేయకపోయినా నాగార్జున మీద మాత్రం గౌరవం చూపిస్తాడు. తన కెరీర్ కి మొదటి ఛాన్స్ ఇచ్చింది నాగార్జునే అని కృతజ్ఞత భావంతో మాత్రం ఉంటాడు ఆర్జీవీ.(RGV)
ఆర్జీవీ – నాగార్జున కాంబోలో వచ్చిన క్లాసిక్ సినిమా శివ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే నాగార్జున మరోసారి ఆర్జీవీతో సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది ఈ ప్రెస్ మీట్ లో.
Also Read : Madhura Sreedhar : మా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే.. ఇళయరాజాకు సపోర్ట్ చేసిన తెలుగు నిర్మాత..
గతంలో నాగార్జున – ఆర్జీవీ కాంబోలో శివ, ద్రోహి, గోవిందా గోవిందా, ఆఫీసర్ సినిమాలు వచ్చాయి. 2018లో చివరగా ఆఫీసర్ సినిమా రాగా ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీనిపై నాగార్జున సమాధానమిస్తూ.. రామ్ గోపాల్ వర్మపై నాకు శివ అప్పుడు ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు కూడా అంతే నమ్మకం ఉంది. అన్ని వర్కౌట్ అయితే కచ్చితంగా ఆర్జీవితో సినిమా చేస్తా అన్నారు.
అయితే దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ.. నేను మాత్రం నాగార్జునతో ఇప్పుడు సినిమా చేయను. నేను ఒక హిట్ ఇచ్చిన తర్వాతే నాగార్జున దగ్గరకు వెళ్తాను. నేను హిట్ కొట్టేదాకా నాగార్జునతో సినిమా చేయను అని ప్రకటించాడు. దీంతో ఆర్జీవి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అసలు ఆర్జీవీ ఇప్పుడు ఫామ్ లో లేదు. హిట్ కొడతాడు అనే నమ్మకం ఎవరికీ లేదు. కానీ ఇటీవల సత్య సినిమా రీ రిలీజ్ తర్వాత ఆర్జీవీ నేను మారిపోయాను, మంచి సినిమా తీస్తాను, హిట్ ఇస్తాను అని అన్నాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఆర్జీవీ హిందీలో పోలీస్ స్టేషన్ మే భూత్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా హిట్ అవుతుందా? భవిష్యత్తులో ఆర్జీవీ నాగార్జునతో సినిమా చేస్తాడో చూడాలి.
Also Read : Shruti Haasan : మహేష్ బాబు కోసం శృతి హాసన్ ని తీసుకొచ్చిన రాజమౌళి.. SSMB29 ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..
