Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మళ్ళీ ముద్దులతో రౌడీ హీరో..

మీరు కూడా కింగ్డమ్ సాంగ్ ప్రోమో చూసేయండి..

Vijay Deverakonda Bhagyashri Borse Kingdom Movie Song

Kingdom : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో గ్లింప్స్ రిలీజ్ చేయగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్డమ్ సినిమా మే 30న రిలీజ్ కానుంది.

Also Read : Sudheer : సుడిగాలి సుధీర్ చంకెక్కిన లేడీ కమెడియన్.. ఇద్దరు భామల మధ్యలో సుధీర్.. టీవీ షోలో రచ్చ.. ప్రోమో వైరల్..

తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. హృదయం లోపల.. అంటూ ఈ పాట సాగనుంది. ఫుల్ సాంగ్ మే 2 న రిలీజ్ అవ్వనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓ బీచ్ లో కూర్చొని విజయ్ భాగ్యశ్రీకి లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవ్వగా మళ్ళీ పాత విజయ్ ని గుర్తు చేస్తున్నాడు అని రౌడీ ఫ్యాన్స్ అంటున్నారు.

మీరు కూడా కింగ్డమ్ సాంగ్ ప్రోమో చూసేయండి..