‘సూర్యకాంతం’ మూవీ ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిధిగా దేవరకొండ..

‘ఒక మనసు’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ ఫేట్ మారుస్తుందని భావించినప్పటికీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది.

  • Publish Date - March 23, 2019 / 04:41 AM IST

‘ఒక మనసు’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ ఫేట్ మారుస్తుందని భావించినప్పటికీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది.

‘ఒక మనసు’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ ఫేట్ మారుస్తుందని భావించినప్పటికీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. దీంతో ‘సూర్యకాంతం’ అంటూ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ మూవీకి మరింత ప్రమోషన్స్ రాబట్టేందుకు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండను రంగంలోకి దింపారు.
Read Also : తమిళ్ అర్జున్ రెడ్డిలో.. ధృవ్‌కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!

నిహారిక కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్న ఆమె కొత్త సినిమా ‘సూర్యకాంతం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడు విజయ్ దేవరకొండ. రేపు (మార్చి 23, 2019) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో జరగబోయే ఈ వేడుకలో ‘సూర్యకాంతం’తో కలిసి సందడి చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. 

ఈ మూవీలో నిహారిక సరసన స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు, ఈ మాయ పేరేమిటో ఫేమ్ రాహుల్ విజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రణీత్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
Read Also : నా ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు : రకుల్‌ ప్రీత్‌సింగ్‌