Vijay Deverakonda : పేరు ముందు ‘ది’ ఎందుకు పెట్టుకున్నాడో క్లారిటీ ఇచ్చిన విజయ్.. ఉన్న స్టార్లు అందరూ తీసేసుకున్నారు..

హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక స్టార్ ఉంటుందని తెలిసిందే. ఇటీవల వచ్చిన కొత్త హీరోలు కూడా ఏదో ఒక స్టార్, లేదా ఐదో ఒక ట్యాగ్ తమ పేరు ముందు పెట్టుకుంటున్నారు. కానీ విజయ్ దేవరకొండకు ఎలాంటి ట్యాగ్ లేదు.

Vijay Deverakonda : సొంతంగా కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉన్నా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు విజయ్ కెరీర్ ని మార్చేసి స్టార్ హీరోని చేసాయి. ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. విజయ్ కి కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా మంది అభిమానులు, ముఖ్యంగా అమ్మాయిల్లో అభిమానులు ఎక్కువమంది ఉన్నారు.

మన హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక స్టార్ ఉంటుందని తెలిసిందే. ఇటీవల వచ్చిన కొత్త హీరోలు కూడా ఏదో ఒక స్టార్, లేదా ఐదో ఒక ట్యాగ్ తమ పేరు ముందు పెట్టుకుంటున్నారు. కానీ విజయ్ దేవరకొండకు ఎలాంటి ట్యాగ్ లేదు. ఇటీవల ఖుషి సినిమాకు మాత్రం ‘ది’ అనే ట్యాగ్ పెట్టుకొని ది విజయ్ దేవరకొండ అనే టైటిల్ వేసుకున్నాడు. అప్పట్లో ఈ టైటిల్ కాస్త వైరల్ అయింది. అయితే ఆ ‘ది’ ఎందుకు పెట్టుకున్నాడు, వేరే స్టార్ లాంటి ట్యాగ్ ఎందుకు పెట్టుకోలేదు అని అంతా అనుకున్నారు.

Also Read : Naga Vamsi : టిల్లు పార్ట్ 3 కన్ఫర్మ్.. ఆ రోజే సిద్ధూ అనౌన్స్ చేస్తాడు..

తాజాగా విజయ్ ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడు వెళ్లగా అక్కడ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ టైటిల్ ట్యాగ్ గురించి ప్రశ్నించడంతో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అన్ని టైటిల్స్ అందరూ తీసేసుకున్నారు. తల, తలైవా, సూపర్ స్టార్.. ఇలా చాలా టైటిల్స్ అందరూ తీసేసుకున్నారు. అలాగే ఏదో ఒక ట్యాగ్ ముందు పెట్టుకొని పిలవడం కంటే కూడా నాకు విజయ్ దేవరకొండ అని పిలుస్తేనే నచ్చుతుంది. నాతో సినిమాలు తీసే నిర్మాతలు లాస్ట్ కొన్ని సినిమాల నుంచి నా పేరు ముందు కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టుకొమ్మని ఒత్తిడి చేసారు. కొన్ని టైటిల్స్ కూడా సజెస్ట్ చేసారు, నాకు నచ్చలేదు. అందుకే సింపుల్ గా ది యాడ్ చేసుకున్నాను. ది విజయ్ దేవరకొండ సింపుల్ గా బాగుంటుంది, నాకు అదే ఇష్టం, ఎలాంటి ట్యాగ్స్ వద్దు అని అన్నారు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు