Nani – Vijay : ‘నాని అన్న డిన్నర్ కి పిలిచాడు.. మేము ఎక్కువ కలవకపోయినా..’ వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు.. ఫ్యాన్స్ మారాలి..

తాజాగా మరోసారి విజయ్ నాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Vijay Deverakonda Interesting Comments on Nani

Nani – Vijay : ఇండస్ట్రీలో కొంతమంది హీరోల ఫ్యాన్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఒకర్నొకరు విమర్శించుకుంటారు. హీరోలు అంతా ఒకటిగా ఉన్నా వీళ్ళు మాత్రం మారరు. హీరోలు ఎన్నిసార్లు కలిసి కనపడినా, వాళ్ళు కలిసి తిరిగినా ఫ్యాన్స్ మాత్రం హీరోలు శత్రువులు అన్నట్టు కొట్టుకుంటారు. అందులో నాని – విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా. గతంలో నాని – విజయ్ దేవరకొండ కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మంచి సినిమా చేసారు.

అయినా విజయ్ ఫ్యాన్స్ నానిని విమర్శిస్తారు. కొంతమంది నాని ఫ్యాన్స్ కూడా విజయ్ ని విమర్శిస్తారు. ఒక్కోసారి సోషల్ మీడియాలో వీళ్ళ ఫ్యాన్స్ వార్స్ మరీ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు మార్లు నాని – విజయ్ ఒకరి గురించి ఒకరు మంచిగా చెప్పినా, ఎవడే రీ యూనియన్ సమయంలో కలిసినా ఫ్యాన్స్ మాత్రం మారట్లేదు. తాజాగా మరోసారి విజయ్ నాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Also Read : Rajinikanth : నాని డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా..? నిజంగా జరుగుతుందా?

విజయ్ త్వరలో కింగ్డమ్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని, ఎవడే సుబ్రహ్మణ్యం టాపిక్స్ వచ్చాయి.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత నేను, నాని అన్న కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. నాకు అప్పుడు తక్కువమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను. నాని అన్నకు పెళ్లి అయింది, బాబు ఉన్నాడు. ఫ్యామిలీతో ఉండేవాడు. ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నారు. దాంతో ఎక్కువ టచ్ లో లేము. మేము ఎక్కువ కలవకపోయినా మేమిద్దరం కలిసినప్పుడు హ్యాపీగా నవ్వుకుంటాం, మంచి సమయం గడుపుతాం. చాలా రోజుల తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం రీ యూనియన్ లోనే నాని అన్నని కలిసాను. మంచి సమయం గడిపాము ఇద్దరం. నాని అన్న ఓ రోజు నన్ను డిన్నర్ కి పిలిచాడు. నేను వెళ్లి వాళ్ళ ఫ్యామిలీని కలిసాను. వాళ్ళతో కలిసి డిన్నర్ చేశాను. అయన ఒక స్పెషల్ పర్సన్, అది ఒక స్పెషల్ ఫిలిం అని చెప్పుకొచ్చాడు.

Also Read : Supritha : హాస్పిటల్ బెడ్ పై సురేఖవాణి కూతురు సుప్రీత.. చేతికి సెలైన్ పెట్టి.. పోస్ట్ వైరల్..

విజయ్ మాటలు విన్నాక ఇప్పటికైనా నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు అని తెలుసుకొని సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్స్ ఆపుతారో లేదో చూడాలి.