Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ పై తేలిపోయిన నెగిటివ్ ప్రచారం.. ఓటీటీలో టాప్ లో దూసుకుపోతూ..

ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల ఏప్రిల్ 26న ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Family Star : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజయి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. అయితే ఈ సినిమా రిలీజయిన సమయంలో కొంతమంది కావాలని ఈ సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేశారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. నిర్మాత దిల్ రాజు స్వయంగా రంగంలోకి దిగి మైక్ పట్టుకొని థియేటర్స్ వద్ద రివ్యూలు తీసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు ఈ సినిమాకు. అలా దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగిటివ్ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల ఏప్రిల్ 26న ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Sagar : అందుకే సీరియల్స్ మానేశాను.. మొగలిరేకులు RK నాయుడు..

ఇప్పుడు కూడా కొంతమంది కావాలని ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఒకటి రెండు సీన్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అంతా చాలా బాగుంది. కానీ ఆ రెండు సీన్స్ ని పట్టుకొని కొంతమంది విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాలోని సీన్స్ ని కట్ చేసి సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో దూసుకుపోతుంది. ఈ వారం ఇండియాలో టాప్ 1 సినిమాగా ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమ్ అవుతుంది. దీంతో ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా ఫ్యామిలీ స్టార్ ఆడియన్స్ కి దగ్గరవ్వడం ఆపలేకపోయారు అని చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు ఫ్యామిలీ స్టార్ సినిమాని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రిలీజ్ టైమ్ లో సినిమా మీద వచ్చిన నెగిటివ్ ప్రచారం నిజమనుకుని థియేటర్ లో చూడలేదని, ఇప్పుడు ఓటీటీలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ ఫర్ఫార్మెన్స్ లను కూడా మెచ్చుకుంటున్నారు. కొంతమంది కావాలని చేసిన నెగిటివ్ ప్రచారం కూడా ఒకరకంగా సినిమాకు ప్లస్ అయిందని, మరింతమందికి సినిమా రీచ్ అయిందని అంటున్నారు. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ టాప్ ప్లేస్ లో దూసుకుపోవడంతో నెగిటివ్ ప్రచారం అంతా అబద్దం అని, కావాలని చేశారని అంతా భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు