VD 12 release date : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. VD12 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల శ్రీలంక షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. దాదాపుగా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా చిత్ర బృందం సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. వర్షంలో తడుస్తూ, ముఖంపై రక్తంతో ఉన్న విజయ్.. దెబ్బలు తగలడంతో రక్తం వస్తుండగా చాలా కోపంగా పైకి చూస్తూ అరుస్తున్నాడు. మొత్తంగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్రకటించనున్నట్లు తెలిపింది.
Darling : నభానటేష్ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
His Destiny awaits him.
Mistakes.
Bloodshed.
Questions.
Rebirth.28 March, 2025.#VD12 pic.twitter.com/z2k0qKDXTC
— Vijay Deverakonda (@TheDeverakonda) August 2, 2024