Vijay – Rashmika : ఎనిమిదేళ్ల క్రితం కలిసిన అమ్మాయి.. బాబోయ్.. రష్మికని తెగ పొగిడిన విజయ్.. రష్మిక ఏమందంటే..

ఈ టీజర్ ని రిలీజ్ చేస్తూ రష్మికని ఓ రేంజ్ లో పొగిడేసాడు విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda Praises Rashmika Mandanna after Releasing The Girlfriend Teaser

Vijay – Rashmika : రష్మిక, విజయ్ దేవరకొండ చాలా క్లోజ్ అని అందరికి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరూ కలిసి రెండు సినిమాలు చేసారు. వీరి మధ్య ప్రేమ ఉందని, డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి. దానికి తోడు ఇద్దరూ కలిసి బయట ఎంజాయ్ చేసే ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. రష్మిక అన్ని పండగలను విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకుంది.

ఇక రష్మిక ఇటీవలే పుష్ప 2 సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టింది. తాజాగా నేడు రష్మిక మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ విజయ్ దేవరకొండ వాయిస్ తో ఉంది. అంతే కాకుండా విజయ్ ఈ టీజర్ ని తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. అయితే ఈ టీజర్ ని రిలీజ్ చేస్తూ రష్మికని ఓ రేంజ్ లో పొగిడేసాడు విజయ్ దేవరకొండ.

Also Read : The Girlfriend : రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ వాయిస్ తో అదిరిందిగా..

విజయ్ దేవరకొండ రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ చేస్తూ.. టీజర్లో ప్రతి విజువల్ నాకు నచ్చింది. ఈ సినిమా చూడటానికి నేను ఎదురుచూస్తున్నాను. రష్మిక మాలో చాలా మంది హీరోలకు సక్సెస్ రావడంలో భాగమయి లక్కీ చార్మ్ గా మారింది. తను యాక్టర్ గా, పర్ఫార్మర్ గా ఎదిగినా పర్సన్ గా నేను ఎనిమిదేళ్ల క్రితం కలిసిన అదే అమ్మాయిగా ఉంది. ఈ ప్రాజెక్టుని రష్మిక తన భుజాలపై మోస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని రాసుకొచ్చాడు.

దీంతో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ కి రష్మిక మందన్న రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ సో మచ్. నేను నిన్ను, అందర్నీ ఈ సినిమాతో గర్వంగా ఫీల్ అయ్యేలా అచేస్తాను. నువ్వు నా గురించి చెప్పిన మాటలకు థ్యాంక్యూ అని తెలిపింది. ప్రస్తుతం విజయ్, రష్మిక ట్వీట్స్ వైరల్ గా మారాయి.