The Girlfriend : రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ వాయిస్ తో అదిరిందిగా..

మీరు కూడా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూసేయండి..

The Girlfriend : రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ వాయిస్ తో అదిరిందిగా..

Rashmika Mandanna The Girlfriend Teaser Released by Vijay Devarakonda

Updated On : December 9, 2024 / 11:16 AM IST

The Girlfriend Teaser : రష్మిక మందన్న తాజాగా పుష్ప 2 సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉంది. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, మారుతి నిర్మాణంలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read : Pushpa 2 : ఇదేం రచ్చరా బాబు.. పుష్ప 2 టికెట్ల కోసం నార్త్ లో కొట్టుకుంటున్న ప్రేక్షకులు.. థియేటర్స్ వద్ద క్యూలైన్స్..

గతంలో రష్మిక పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో టీజర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూసేయండి..

ఈ టీజర్ కి విజయ్ దేవరకొండ వాయిస్ ఇచ్చాడు. ఓ ప్రేమ కవితతో ఈ టీజర్ సాగింది. రష్మిక మందన్న ఓ కాలేజీలో జాయిన్ అవ్వడం, కాలేజీ హాస్టల్ లో జాయిన్ అవ్వడం, ఒక అబ్బాయితో ప్రేమలో పడటం, ఆ ప్రేమలో బాధలు ఉండటం.. టీజర్లో చూపించారు. ఈ టీజర్ చూస్తుంటే ఒక అమ్మాయి కోణంలో సాగే లవ్ స్టోరీ సినిమా అని తెలుస్తుంది.