Pushpa 2 : ఇదేం రచ్చరా బాబు.. పుష్ప 2 టికెట్ల కోసం నార్త్ లో కొట్టుకుంటున్న ప్రేక్షకులు.. థియేటర్స్ వద్ద క్యూలైన్స్..

నార్త్ థియేటర్స్ బయట పుష్ప 2 టికెట్ల కోసం భారీగా జనాలు వెయిట్ చేస్తున్నారు

Pushpa 2 : ఇదేం రచ్చరా బాబు.. పుష్ప 2 టికెట్ల కోసం నార్త్ లో కొట్టుకుంటున్న ప్రేక్షకులు.. థియేటర్స్ వద్ద క్యూలైన్స్..

North Audience Huge Crowd at Theaters for Allu Arjun Pushpa 2 Tickets

Updated On : December 9, 2024 / 10:51 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా థియేటర్స్ లో రచ్చ చేస్తుంది. రిలీజయిన మూడు రోజుల్లోనే 621 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అన్ని ఏరియాలలో దూసుకుపోతుంది. నిన్న ఆదివారం కూడా భారీగా థియేటర్స్ కి జనాలు వచ్చారు. అయితే పుష్ప 2 సినిమాకు సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ రీచ్ వస్తుంది. నార్త్ ఆడియన్స్ పుష్ప 2 సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు. థియేటర్స్ కి అక్కడి ప్రజలు క్యూ కడుతున్నారు.

నార్త్ థియేటర్స్ బయట టికెట్ల కోసం భారీగా జనాలు వెయిట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల క్యూలైన్స్ థియేటర్ దాటి బయటి వరకు వెళ్తున్నాయి. కొన్ని చోట్ల పుష్ప టికెట్ల కోసం ప్రేక్షకులు కొట్టుకుంటున్నారు కూడా. టికెట్ కౌంటర్లు దగ్గర భారీగా జనాలు గుమిగూడి పుష్ప 2 టికెట్స్ కోసం రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్ప టీం ఈ వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Also Read : Naga Chaitanya – Sobhita : నాగచైతన్య, శోభిత.. ఇద్దరూ పిల్లల గురించే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయంలో సమంత..

నార్త్ లో థియేటరస్ దగ్గర పుష్ప 2 టికెట్ల కోసం వస్తున్న జనాల్ని చూసి ఇక్కడ తెలుగు, సౌత్ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలో అయితే కొన్ని ఏరియాలలో పర్మిషన్స్ తీసుకొని అర్ధరాత్రి షోలు కూడా వేస్తున్నారట. అప్పుడు కూడా ఫుల్ గా జనాలు వస్తున్నారు. ఇక గుజరాత్ లో కూడా భారీగా కలెక్షన్స్ సాధించింది పుష్ప. అసలు నార్త్ లో ఏ హిందీ సినిమా కలెక్ట్ చేయలేనని వసూళ్లు పుష్ప 2 కలెక్ట్ చేస్తుంది.

హిందీలో పుష్ప 2 మొదటి రోజే 72 కోట్లు, మూడో రోజు 74 కోట్లు కలెక్ట్ చేసి ఏ సినిమాకు లేని రికార్డ్ సెట్ చేశారు. అల్లు అర్జున్ హవా నార్త్ లో బాగా కనిపిస్తుంది. పుష్ప 2 దెబ్బకు బన్నీ నార్త్ లో కూడా స్టార్ హీరో అయిపోయాడు. ఈ హవా చూస్తుంటే ఫుల్ కలెక్షన్స్ లో నార్త్ నుంచే ఎక్కువ వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే నార్త్ నుంచి 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.