Naga Chaitanya – Sobhita : నాగచైతన్య, శోభిత.. ఇద్దరూ పిల్లల గురించే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయంలో సమంత..

చైతు, శోభిత ఎక్కువగా ఎందుకు పిల్లల గురించే మాట్లాడుతున్నారు అని ఇప్పుడు చర్చగా మారింది.

Naga Chaitanya – Sobhita : నాగచైతన్య, శోభిత.. ఇద్దరూ పిల్లల గురించే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయంలో సమంత..

Naga Chaitanya Sobhita Talking more about Children samantha rumours goes viral again

Updated On : December 9, 2024 / 10:14 AM IST

Naga Chaitanya – Sobhita : నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న కొన్నాళ్ళకు చైతు – శోభిత ప్రేమలో పడి ఇద్దరూ సీక్రెట్ డేటింగ్ చేశారు. కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం చైతు – శోభిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే చైతు – శోభిత ప్రేమ గురించి అధికారికంగా అందరికి తెలిసిన తర్వాత ఈ ఇద్దరూ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎక్కువగా పిల్లల గురించి, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు.

శోభిత ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. నాకు తల్లి కావాలని ఉంది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది. మన సంప్రదాయంగా పెళ్లి చేసుకుంటాను. కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తాను అంటూ మాట్లాడింది. తాజాగా నాగచైతన్య కూడా రానా దగ్గుబాటి టాక్ షోలో మాట్లాడుతూ.. నాకు ఒక ఇద్దరు పిల్లలు కావాలి. 50 ఏళ్ళు వచ్చేసరికి భార్య, పిల్లలతో ఫ్యామిలీ సమయాన్ని హ్యాపీగా గడపాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి అని తెలిపాడు. శోభిత అయితే రెండు మూడు ఇంటర్వ్యూలలో పిల్లల గురించి, మాతృత్వం గురించి మాట్లాడింది.

Also Read : Chiranjeevi – Allu Arjun : ఒకే పెళ్ళిలో అల్లు అర్జున్, చిరంజీవి.. ఫోటోలు వైరల్..

దీంతో చైతు, శోభిత ఎక్కువగా ఎందుకు పిల్లల గురించే మాట్లాడుతున్నారు అని ఇప్పుడు చర్చగా మారింది. గతంలో చైతన్య – సమంత విడిపోవడానికి కారణాలు ఏంటి అంటే అనేక రూమర్స్ వినిపించాయి. అలాంటి రూమర్స్ లో చైతన్య, అక్కినేని ఫ్యామిలీ పిల్లలు కావాలి అనుకుంటే సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పుడే పిల్లలని కనడానికి సమంత ఇష్టపడట్లేదని కూడా రూమర్ వినిపించింది.

సమంతతో విడిపోయాక చైతు మళ్ళీ ప్రేమలో పడి ఈ సారి తెలుగమ్మాయి శోభితని సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకోవడం, శోభిత, చైతు ఇంటర్వ్యూలలో పెళ్లి, పిల్లల గురించే ఎక్కువగా మాట్లాడటంతో సమంత గురించి వచ్చిన రూమర్ నిజమేనేమో అని ఫ్యాన్స్, నెటిజన్లు భావిస్తున్నారు. వాళ్ళు ఎందుకు విడిపోయారా కారణాలు తెలీదు కానీ వచ్చిన రూమర్స్ కి తగ్గట్టు ఇప్పుడు చైతు, శోభిత మాట్లాడటంతో పిల్లల విషయంలోనే చైతు – సమంత మధ్య విబేధాలు వచ్చాయేమో అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకొని వారి వర్క్స్ తో బిజీగా ఉన్నారు. మరి త్వరలోనే చైతు – శోభిత తల్లితండ్రులు అవుతారా చూడాలి.