Chiranjeevi – Allu Arjun : ఒకే పెళ్ళిలో అల్లు అర్జున్, చిరంజీవి.. ఫోటోలు వైరల్..
తాజాగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఫ్యామిలీలతో ఓ పెళ్ళికి వెళ్లారు. చిరంజీవి కూడా ఆ పెళ్ళికి వెళ్లారు.

Allu Arjun and Chiranjeevi went o A Marriage Photos goes Viral
Chiranjeevi – Allu Arjun : గత కొంతకాలంగా అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడంతో పవన్ ఫ్యాన్స్, జనసైనికులు, మెగా ఫ్యాన్స్ బన్నీ పై విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అప్పట్నుంచి సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టు సాగుతుంది. దానికి తోడు నాగబాబు అప్పుడప్పుడు కౌంటర్ పోస్టులు పెట్టి డిలీట్ చేయడం సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో కొట్టడంతో నిజంగానే ఫ్యామిలీల మధ్య దూరం వచ్చిందేమో అనుకున్నారు.
Also See : Sobhita Dhulipala : పెళ్లికూతురుగా శోభిత ఎంత అందంగా ఉందో.. ఫోటోలు షేర్ చేసిన శోభిత..
అయితే తాజాగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఫ్యామిలీలతో ఓ పెళ్ళికి వెళ్లారు. చిరంజీవి కూడా ఆ పెళ్ళికి వెళ్లారు. సంజన బీరపల్లి అనే అమ్మాయి పెళ్ళికి వీరిద్దరూ వెళ్లారు. పెళ్లి కూతురు తండ్రి ఈ రెండు ఫ్యామిలీలకు సన్నిహితుడు అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరు ఆ పెళ్ళికి హాజరయ్యారు. చిరంజీవి కొత్త జంటను ఆశీర్వదించారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహ, కూతురు అర్హతో వచ్చారు. అలాగే అల్లు అరవింద్ తన భార్య, అల్లు శిరీష్ తో కలిసి వచ్చారు.
ఈ రెండు ఫ్యామిలీలు కలిసి దిగిన ఫోటోలు లేవు కానీ ఒకే పెళ్ళికి ఈ రెండు ఫ్యామిలీలు రావడంతో కచ్చితంగా అక్కడ రెండు ఫ్యామిలీలు ఎదురుపడతాయి, మాట్లాడుకుంటారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ ఫోటోలను ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ పోస్ట్ చేసింది. ఇటీవల అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సక్సెస్ మీట్ లో టికెట్ రేట్లు పెంచినందుకు కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ అని చెప్పడం, ఇప్పుడు రెండు ఫ్యామిలీలు ఒకే పెళ్ళిలో కలవడంతో వీరి మధ్య విబేధాలు ఏమి లేవు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హడావిడి తప్ప అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : Pushpa 2 : పుష్ప 2 డైరెక్ట్ సెకండ్ హాఫ్ వేసిన థియేటర్.. అప్పటికి కానీ అర్ధం కాలేదు.. డబ్బులు ఇవ్వాలని గొడవ..