Vijay Deverakonda : వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా..? నేను మారను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

తనపై, తన సినిమాలపై వస్తున్న నెగిటివిటీకి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Vijay Deverakonda)

  • Published on- October 8, 2026 / 08:16 PM IST

Vijay Deverakonda

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ రణబాలి సినిమాతో అక్టోబర్ 16న రాబోతున్నాడు. నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ తనపై, తన సినిమాలపై వస్తున్న నెగిటివిటీకి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also See : Ranabaali Trailer Launch : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నాపై, నా సినిమాల పై జరుగుతున్న వాటిని విద్వేషం అనలేం. పనిగట్టుకొని కొన్ని గ్రూపులు పోస్ట్‌లు పెడుతున్నాయి. సోషల్‌మీడియాలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అది తప్పు కాదు. కానీ కొంతమంది ఓ 50 అకౌంట్లు పెట్టుకుని అన్నింటిలోనూ ఒకే పోస్ట్‌ పెడతారు. తెలుగు సినిమా రణబాలి కాకుండా మనం జైలర్‌2 వెళ్ళాలి అని సడెన్‌గా 50 అకౌంట్స్‌ నుంచి ఒకే రీల్‌ వస్తుంది. అంతమంది ఒకేసారి అలా పెడుతున్నారంటే ఎవరో కూర్చొని డబ్బులు పెట్టి మరీ చేయిస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ సినిమాల్లోనే కాదు అన్ని చోట్ల వ్యవస్థ అలా తయారైంది. దాన్ని మనం ఏమి అనలేం. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేయిస్తున్న వాడు రేపు ఏఐతో ఆ పనిచేయిస్తాడు. అప్పుడు ఈ పనిచేసే వాళ్లు ఏం చేస్తారు?సినిమాను ప్రచారం చేయడానికి నేను సపోర్ట్‌ చేస్తా. ఎవరో ఒకరు బాగుపడతారు. కానీ ఒకరిని కిందకు లాగడానికి చేస్తే ఎందుకురా ఈ పనులు అనిపిస్తుంది.

నా మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు వాళ్ళ జీవితాలు గొప్పగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. నా కలలు, నా శ్రమ వాళ్లకు అనవసరం అనిపిస్తే నేనాగాలా? నా నిజాయితీ వాళ్లకు అహంకారం అనిపిస్తే, నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా, నా జర్నీ వాళ్లకు అర్థం కాకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా, నేను మారను. వాళ్ళే మారాలి. మీరు కూడా బాగుపడితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా బాగుంటారు. ఇలా వెనక్కి లాగే పనులు చేస్తే ఉపయోగం ఉండదు అని అన్నారు. దీంతో విజయ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Ranabaali Trailer : ‘రణబాలి’ ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడుగా..