Tollywood : బిగ్ బాస్ ఫేమ్ నటుడు.. హీరోగా సినిమా.. షూటింగ్ ఫుటేజ్ మిస్సింగ్.. బాధలో హీరోయిన్..
ఈ బిగ్ బాస్ నటుడు హీరోగా కొత్త సినిమా మొదలయింది. (Tollywood)
Tollywood
Tollywood : అతను సీరియల్ నటుడు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి సీరియల్స్ లో సెట్ అయ్యాడు. సీరియల్స్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. మరో సీరియల్ నటిని పెళ్లి చేసుకున్నాడు. తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఓ పక్క సీరియల్స్, టీవీ షోలు చేస్తూనే హీరోగా సినిమాలు గట్టిగానే ట్రై చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ బిగ్ బాస్ నటుడు హీరోగా కొత్త సినిమా మొదలయింది. షూటింగ్ కూడా అయిపోయింది. హీరోయిన్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉన్న ఓ కొత్త అమ్మాయిని తీసుకున్నారు. కాశ్మీర్ కి వెళ్లి హిమాలయాల్లో ఓ సాంగ్ కూడా చేసుకొచ్చారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. టైటిల్ మీద పెద్ద చర్చ కూడా జరిగింది. ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.
తాజాగా ఆ కొత్త హీరోయిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కానీ కొంత షూటింగ్ ఫుటేజ్ మిస్ అయింది. సినిమా అందుకే లేట్ అవుతుంది. మిస్ అయిన ఫుటేజ్ గురించి ట్రై చేస్తున్నారు. అది రాకపోతే కొన్ని సీన్స్ మళ్ళీ షూటింగ్ చేయాల్సి వస్తుంది అని తెలిపి హీరోయిన్ గా మొదటి సినిమాకే ఇలా అయిందని బాధపడింది.
అయితే ఆ షూటింగ్ ఫుటేజ్ ఎలా మిస్ అయింది? ఎవరు మిస్ చేసారు అనేది మాత్రం చెప్పలేదు. మూవీ టీమ్ అంత జాగ్రత్తగా ఉన్నారా అని దీనిపై టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. మరి ఆ బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ నటుడి హీరో కల ఈ సినిమాతో నెరవేరుతుందా? ఈ హీరోయిన్ ఫస్ట్ సినిమా వస్తుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read : Dhanush Political Party : విజయ్‌కి పోటీగా ధనుష్ పొలిటికల్ పార్టీ.. పేరు ఇదే.. 2031 ఎన్నికల్లో బరిలోకి..?
