Bigg Boss Telugu 10 : అమ్మ బాబోయ్.. మాకొద్దు బిగ్ బాస్.. డబ్బులు దండిగా ఇస్తామంటున్న వద్దంటున్న సెలబ్రిటీలు..
ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలకి కొంతమంది సెలబ్రిటీలు నో చెప్తున్నారంట. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ అతిపెద్ద రియాల్టీ షోలలో ఒకటి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఆ పైన సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో బిగ్ బాస్ లోకి సెలబ్రిటీలు వచ్చి వాళ్ళు గొడవలు పడి, టాస్కుల కోసం కొట్టుకొని, గేమ్స్ ఆడి అందర్నీ మెప్పించారు. మొదట్లో ఈ షోపై అందరికి ఆసక్తి ఉండేది. కానీ రానురాను ఆసక్తి తగ్గింది. పైగా ఇప్పుడు కామనర్స్ పేరుతో ఎవరికీ తెలియని వాళ్ళు రావడంతో బిగ్ బాస్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు.
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 జరుగుతుంది. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పెద్దగా ఆసక్తిగా లేదు. అందుకు మెయిన్ కారణం అగ్నిపరీక్ష బ్యాచ్ కూడా. ఎప్పుడు లేని విధంగా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ గేమ్ ఆడకుండా ఒక బ్యాచ్ గా ఉంటూ సెలబ్రిటీలను నెగిటివ్ చేయించడం, బయట డబ్బులు పెట్టి ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ ఏమి ఆడకుండానే వాళ్ళని వాళ్ళు హైలెట్ చేసుకొని, సెలబ్రిటీలని తక్కువ చేయడం చేస్తున్నారు. అందుకే ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలకి కొంతమంది సెలబ్రిటీలు నో చెప్తున్నారంట.
Also Read : Dhanush Political Party : విజయ్‌కి పోటీగా ధనుష్ పొలిటికల్ పార్టీ.. పేరు ఇదే.. 2031 ఎన్నికల్లో బరిలోకి..?
తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ సీరత్ కపూర్, జబర్దస్త్ కమెడియన్లు నూకరాజు, రాకింగ్ రాకేష్‌లకు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆఫర్ ఇచ్చినా అస్సలు వద్దంటే వద్దు అని చెప్పారట. వీరితో పాటు మరికొంతమంది టీవీ, సినీ సెలబ్రిటీలకు కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా డబ్బు కంటే మంచి పేరు ముఖ్యం అని నో చెప్పారంట. బిగ్ బాస్ లో కొన్ని ఫిజికల్ టాస్కులు ఆడి దెబ్బలు తగిలించుకోవడం, ఎవరో తెలియని వాళ్ళ చేత ఏ కారణం లేకుండా మాటలు పడటం, బయట జనాల్లో నెగిటివిటి తెచ్చుకోవడం, ఉన్న పేరు పోగొట్టుకోవడం.. ఇవన్నీ మేము పడలేమంటూ బిగ్ బాస్ కి నో చెపుతున్నారట. బిగ్ బాస్ కి వెళ్లేందుకు సెలబ్రిటీలు అయితే ఆసక్తి చూపించట్లేదు అని టాక్.
ప్రస్తుతానికి అయితే వైల్డ్ కార్డు ద్వారా అగ్నిపరీక్ష ఫేమ్ రామకృష్ణ, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నీతూ నటరాజ్ లు బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది.
