×
Ad

Kushi Movie Collections : ఖుషి సెకండ్ డే కలెక్షన్స్.. యాదాద్రిలో కుటుంబంతో సహా విజయ్ పూజలు..

విజయ్ దేవరకొండ, సమంత 'ఖుషి' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో నిర్మాతలను ఖుషీ చేస్తుంది. రెండో రోజు ఈ చిత్రం..

  • Published On : September 3, 2023 / 02:39 PM IST

Vijay Deverakonda Samantha Kushi Movie Second Day Collections

Kushi Movie Collections : శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చింది. పాటలు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో మొదటిరోజే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక సినిమా కూడా బాగుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.

Chinmayi : సమంత పై వచ్చే ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి.. మగజాతి ఆణిముత్యం అని చెప్పుకొనే..

మొదటి రోజు 30.1 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం సెకండ్ డే 20.9 కోట్ల గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద రెండు రోజుల్లో రూ.51 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అంటే దాదాపు 25 కోట్ల షేర్ ని అందుకుంది. ఈరోజు సండే కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేపాటికి దాదాపు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి మొదటి వీకెండ్ కి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. కాగా అటు అమెరికాలో కూడా కేవలం రెండు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ని అందుకొంది.

Gadar 2 : గదర్ 2 సినిమా 500 కోట్ల సక్సెస్ పార్టీ.. సల్మాన్, షారుఖ్‌తో సహా తరలి వచ్చిన బాలీవుడ్..

ఇక ఈ మూవీ కలెక్షన్స్ తో చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా సూపర్ సక్సెస్ అవడంతో నేడు విజయ్ దేవరకొండ కుటుంబం, మైత్రీ నిర్మాతలు, దర్శకుడు శివ నిర్వాణ.. యాదాద్రి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఈ సినిమా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాలి. ఇప్పుడు ఉన్న స్పీడ్ చూస్తుంటే.. మొదటి వారం పూర్తి అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉంది.