Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, సత్యదేవ్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘కింగ్డమ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు జూలై 31న థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కింది ఈ సినిమా. తాజాగా కింగ్డమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
కింగ్డమ్ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. అభిమానులు సినిమా కోసం ఎంతలా మొక్కుకున్నారో, ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. గురువారం విడుదలంటే నేను మొదట భయపడ్డాను. కానీ నాగవంశీ గారు ఈ సినిమా నమ్మి గురువారం రిలీజ్ చేశారు. టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు అని తెలిపారు.
Also Read : Kingdom Success Meet : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సక్సెస్ మీట్ ఫొటోలు..
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. మేము అనుకున్నట్టుగానే సినిమాకి మంచి స్పందన వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో సాంకేతికంగా ఇంత గొప్పగా ఉన్న సినిమా ఇదే అని అంటున్నారు. ఒక తెలుగు సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాము. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. సినిమా వసూళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజే చాలా చోట్ల బిజినెస్ చేసిన దానిలో సగానికి పైగా రాబడుతోంది అని అన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ.. నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే. సొంతంగా వచ్చి ఏదో సాధించాలి అనుకునే ఎందరికో విజయ్ స్ఫూర్తి. అలాంటి విజయ్ గెలవడం ఆనందంగా ఉంది. నాగవంశీ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడే సినిమాలను రిస్క్ చేసి తీస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారి ధన్యవాదాలు. గౌతమ్ ఈ కథ చెప్పగానే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి అనుకున్నాను అని తెలిపారు.
నెగిటివ్ పాత్ర చేసిన వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సక్సెస్ ప్రెస్ మీట్. ప్రేక్షకులతో కలిసి కింగ్‌డమ్ చూశాను. నా ఇంట్రోకి చప్పట్లు కొట్టారు. చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన సినిమా అని అన్నారు.