Kingdom 2 : ‘కింగ్డమ్’ పార్ట్ 2 ఉంటుంది.. పెద్ద హీరో చేస్తున్నాడు.. సీక్వెల్ పై నిర్మాత కామెంట్స్.. కింగ్డమ్ 2 కథ ఇదే..

సక్సెస్ మీట్ లో కింగ్డమ్ సీక్వెల్ పై నిర్మాత నాగవంశీ స్పందించారు.

Kingdom 2 : ‘కింగ్డమ్’ పార్ట్ 2 ఉంటుంది.. పెద్ద హీరో చేస్తున్నాడు.. సీక్వెల్ పై నిర్మాత కామెంట్స్.. కింగ్డమ్ 2 కథ ఇదే..

Kingdom 2

Updated On : July 31, 2025 / 5:57 PM IST

Kingdom 2 : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ముందే ఈ సినిమాకు రెండు పార్టులు ఉంది అని చెప్పారు కానీ పార్ట్ 1 రిజల్ట్ తర్వాత చూస్తాం అన్నారు. సినిమాలో పార్ట్ 2కి కావాల్సిన లీడ్ ఇచ్చి వదిలేసారు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ లో కింగ్డమ్ సీక్వెల్ పై నిర్మాత నాగవంశీ స్పందించారు. నాగవంశీ మాట్లాడుతూ.. కింగ్డమ్ పార్ట్ 2 ఉంటుంది. విజయ్ కి ఉన్న కమిట్మెంట్స్ అయ్యాక పార్ట్ 2 ఉంటుంది. సేతు పాత్ర ఓ పెద్ద హీరో చేస్తున్నాడు. హీరోయిన్ కి సెకండ్ పార్ట్ లో ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. అందుకే ఇందులో కొన్ని సీన్స్ సెట్ అవ్వక కట్ చేసాం. సెకండ్ పార్ట్ లో హీరో – హీరోయిన్ కి మధ్య వార్ ఉంటుంది అని తెలిపాడు.

Also Read : They Call Him OG : పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..? కొత్త పోస్టర్ రిలీజ్..

దీంతో కింగ్డమ్ పార్ట్ 2 కథ కూడా రెడీ అయినట్టు, విజయ్ డేట్స్ ఇస్తే చేయడానికి రెడీ ఉన్నట్టు తెలుస్తుంది. పార్ట్ 1 ఎండింగ్ లో హీరో శ్రీలంక లోని ఓ తెగకు రాజుగా మారతాడు. అతను ఇండియా నుంచి వచ్చిన స్పై అని వాళ్లకు తెలియదు. ఆ తెగకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తెలుసుకుంటాడు. అలాగే హీరోయిన్ కి ఓ విషయం తెలిసి హీరోకి చెప్పకుండా ఉంటుంది. ఆమె మీద పగ తీర్చుకోడానికి వస్తాడు అని హింట్ కూడా ఇస్తారు. అలాగే హీరోని ఎదిరించడానికి సేతు అనే ఓ కొత్త విలన్ రాబోతున్నట్టు చూపించారు.

దీంతో కింగ్డమ్ పార్ట్ 2లో ఆ తెగ వాళ్లకు హీరో స్పై అని తెలిస్తే ఏం చేస్తారు? హీరో హీరోయిన్ ని ఏం చేస్తాడు? కొత్త విలన్ హీరో ని ఏం చేస్తాడు? శ్రీలంకలో హీరో ఎదుగుతాడా? ఇండియాకు తిరిగి వస్తాడా అనే కథ ఉంటుందని తెలుస్తుంది.

Also Read : Vijay Deverakonda : నేనే ఇంకా సినిమా చూడలేదు.. నేను థియేటర్ కి వెళ్లాలంటే భయపెడుతున్నారు..