Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాతో రాబోతున్నాడు. పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ తో ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి క్యారెక్టర్ లో మా నాన్న గుర్తొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా మా నాన్న చేసే పనులు చూస్తున్నాను. అందుకే ఈ కథకి నేను కనెక్ట్ అయ్యాను. అప్పటికి సినిమా టైటిల్, హీరో క్యారెక్టర్ కి పేరు ఏమి అనుకోలేదు. దీంతో నేనే మా నాన్న పేరు గోవర్ధన రావు నుంచి తీసుకొని ఈ క్యారెక్టర్ కి గోవర్ధన్ అనే పేరు పెట్టమని డైరెక్టర్ ని అడిగాను, ఓకే అన్నారు. అలాగే సినిమాకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ కూడా నేనే సజెస్ట్ చేసాను. మా ఇంటికి మా నాన్నే ఫ్యామిలీ స్టార్ అని తెలిపారు.
Also Read : Tillu Cube : ‘టిల్లు క్యూబ్’ కథ కూడా రివీల్ చేసేసిన సిద్ధూ.. ఈసారి సూపర్ హీరో..
ఇలా విజయ్ తన నాన్న మీద ప్రేమని సినిమాలో పాత్రకు తన పేరుని పెట్టి చూపించుకున్నాడు. అలాగే ప్రమోషన్స్ లో స్టేజి మీద వాళ్ళ నాన్నకి ఐ లైవ్ యు చెప్పాడు విజయ్.