Tillu Cube : ‘టిల్లు క్యూబ్’ కథ కూడా రివీల్ చేసేసిన సిద్ధూ.. ఈసారి సూపర్ హీరో..
తాజాగా సిద్ధూ ఓ ఇంటర్వ్యూలో టిల్లు క్యూబ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర పాయింట్ ని చెప్పాడు.

Siddhu Jonnalagadda Reveals Tillu Square Sequel Tillu Cube Story Line
Tillu Cube : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చేసింది. డీజే టిల్లు సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం సాధించి సిద్ధూకి మంచి కెరీర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ మొదటి పార్ట్ కంటే కూడా భారీ విజయం సాధిస్తుంది. ఇప్పటికే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
టిల్లు క్యారెక్టర్ ఈసారి కూడా బాగా పేలింది. దీంతో ఈ సినిమాకి కూడా సీక్వెల్ అనౌన్స్ చేస్తూ టిల్లు క్యూబ్ కూడా తీస్తామని అధికారికంగానే ప్రకటించారు మూవీ యూనిట్. తాజాగా సిద్ధూ ఓ ఇంటర్వ్యూలో టిల్లు క్యూబ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర పాయింట్ ని చెప్పాడు.
Also Read : Tillu Square : ‘టిల్లు స్క్వేర్’లో బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్య సీన్స్ ఉండాలి.. కానీ కట్ చేసేశారా..
సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. డీజే టిల్లులో అమ్మాయి మోసం చేసే పాయింట్ ఉంది. టిల్లు స్క్వేర్ అదే పాయింట్ తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది ఉంది. ఈ సారి టిల్లు క్యూబ్ లో టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఉండబోతుంది. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతాను అని తెలిపారు. ఇటీవల సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఇప్పట్నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి.
malla adhe oka heroine cheating revenge format la kakunda idhe better. Super hero tillu cube ? pic.twitter.com/bspMK3tLLO
— Phoebe (@Nasavnensasthaa) April 1, 2024