Tillu Square : ‘టిల్లు స్క్వేర్’లో బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్య సీన్స్ ఉండాలి.. కానీ కట్ చేసేశారా..
'టిల్లు స్క్వేర్'లో బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్య సీన్స్ ఉండాలట. సిద్ధూతో శ్రీసత్యకి సంబంధించిన కొన్ని సీన్స్..

BiggBoss fame srisatya scenes are deleted from Siddhu Jonnalagadda Tillu Square
Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’.. ప్రస్తుతం థియేటర్స్ లో తెగ సందడి చేస్తుంది. డీజే టిల్లుకి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంలో నేహశెట్టి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి ఆడియన్స్ తో విజుల్స్ వేయించారు. కాగా ఈ మూవీలో టిల్లు గాడు ఈ ఇద్దరి భామలతోనే కాకుండా బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్యతో కూడా కొన్ని సీన్స్ చేశారట. అయితే సినిమాలో ఈ సీన్ ఎక్కడా కనిపించలేదు.
మూవీలో శ్రీసత్య ఉన్నాగాని, ఎవరు గుర్తించలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం ‘రాధిక’ సాంగ్‌లో వెనకాల నిలబడి కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో శ్రీసత్య పాత్ర కొంచెం ఎక్కువగానే ఉండేదట. సిద్ధూతో శ్రీసత్యకి సంబంధించిన కొన్ని సీన్స్ తెరకెక్కించారు. ఈ విషయాన్ని శ్రీసత్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ ఎడిటింగ్ లో అవన్నీ కట్ చేసేసారు. చివరాఖరికి అసలు మూవీలో శ్రీసత్య సీన్సే లేకుండా చేసారు. మరి ఆ సీన్స్ ని ఓటీటీ వెర్షన్ లో అయినా రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.
Also read : Sudigali Sudheer : మళ్ళీ బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్.. ‘సర్కార్’లా ఆడించడానికి..
View this post on Instagram
కాగా ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాదించేసి అదుర్స్ అనిపించింది. మొదటి సినిమా కంటే సీక్వెల్ పెద్ద విజయం సాధించడం అనేది బాహుబలి, కేజీఎఫ్ తరువాత మళ్ళీ ఈ సినిమాకే జరిగిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఇప్పటికే రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. దీని దూకుడు చూస్తుంటే.. మొదటి వారం పూర్తి కాకముందే 100 కోట్ల మార్క్ ని అందుకునేలా కనిపిస్తుంది.
సిద్ధూకి ఇప్పటివరకు 100 కోట్ల సినిమా లేదు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తన మొదటి వంద కోట్ల సినిమా అవ్వబోతుంది. కాగా ఈ సినిమా అమెరికాలో కూడా ఏమా దూకుడు చూపిస్తుంది. ఈ వారం అమెరికా టాప్ 10 బాక్స్ ఆఫీస్ మూవీస్ లిస్టులో టిల్లు స్క్వేర్ సినిమా 8వ స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.