Murali Mohan : స్వయంగా వడ్డించి.. బ్లైండ్ స్కూల్ లో మురళి మోహన్ వివాహ వార్షికోత్సవ వేడుకలు..
సీనియర్ నటుడు మురళీమోహన్ తాజాగా తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్ లో అంద విద్యార్థుల మధ్య జరుపుకున్నారు.

సీనియర్ నటుడు మురళీమోహన్ తాజాగా తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్ లో అంద విద్యార్థుల మధ్య జరుపుకున్నారు.

తన, తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను, వివాహ వార్షికోత్సవాలను దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకుంటాను అని తెలిపారు మురళీ మోహన్.

ఈ కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు ప్రముఖ గాయకుడు, భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి, దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మురళీమోహన్ సన్నిహిత మిత్రులు బిఎస్ రావు, ఫిలిం జర్నలిస్టు ప్రభు పాల్గొన్నారు.

దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ.. మురళి మోహన్ ఈ రోజు మా బ్లైండ్ స్కూల్లోని 600 మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు అవసరమైన మొత్తాన్ని అందజేశారు. అలాగే బ్రెయిలీ లిపి పేపర్ బండిల్స్ ను కూడా బహుకరించారు అని తెలిపారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ.. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మన కన్నబిడ్డల్ని కూడా ఇంత ప్రేమగా చూసుకోలేమెమో కానీ చూపులేని ఈ చిన్నారులను ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటూ దీన్ని అభివృద్ధి చేసిన సాయిబాబా గౌడ్, వారి శ్రీమతి జ్యోతి గౌడ్, ఇక్కడ స్టాఫ్ అందరికీ అభినందనలు. ఈ పిల్లలు భగవద్గీతను అభ్యసించి ఆలపించటం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని తెలిపారు.

అనంతరం భోజన శాలలో మురళీమోహన్ స్వయంగా అంధ విద్యార్థులకు భోజనాలు వడ్డించి ఆయన కూడా అక్కడే తిన్నారు.

Murali Mohan
