Samantha : తల్లి కాబోతున్న ‘సమంత’..? భర్తతో కలిసి సందడి చేసిన సామ్.. బేబీ బంప్ అంటూ వీడియోలు వైరల్..
ఈ సెలబ్రేషన్స్ వేడుకల్లో సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొంది. (Samantha Baby Bump)
Samantha Raj Nidimoru Expected Their First Child Baby Bump Video
Samantha : సమంత తాజాగా మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. చాలా ఏళ్ళ తర్వాత సమంత హిట్ కొట్టడంతో సమంత, ఆమె సన్నిహితులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నేడు సమంత ఆఫీస్ వద్ద సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు.
ఈ సెలబ్రేషన్స్ వేడుకల్లో సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొంది. ఈ వేడుకల్లో పాల్గొన్న సమంత వీడియోలు వైరల్ అవుతున్నాయి. సమంత వైట్ కలర్ టైట్ ఫిట్ టీ షర్ట్ వేసుకొచ్చింది. దీంతో తన బేబీ బంప్ కనిపిస్తుంది. అది కచ్చితంగా బేబీ బంప్ అని, త్వరలో సమంత తల్లి కాబోతుందని ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు ప్రమోషన్స్ లో లూజ్ చుడీదార్స్, చీరల్లో కనిపించిన సమంత ఇప్పుడు ఇలా టైట్ టీ షర్ట్ లో కనిపించడంతో బేబీ బంప్ కనిపించిందని అంటున్నారు.
అయితే అది బేబీ బంపా కాదా అనేది సమంతనే చెప్పాలి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సమంత గత సంవత్సరం డిసెంబర్ లో రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకుంది. సమంత పెళ్లి తర్వాత ఇదే తనకు మొదటి సినిమా. మరి త్వరలోనే సమంత తల్లి కాబోతుంది అనే గుడ్ న్యూస్ అధికారికంగా చెప్తుందేమో అని ఎదురుచూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇప్పుడు మాత్రం సమంత బేబీ బంప్ అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#Samantha and Raj Nidimoru are expecting their first child ❤️ pic.twitter.com/GeKDBs1E5V
— The Climax India (@TheClimaxIndia) June 20, 2026
#TFNExclusive: #Samantha celebrates #MaaIntiBangaram success with #RajNidimoru and team 🎊✨#TeluguFilmNagar pic.twitter.com/jEeVWI1Jz8
— Telugu FilmNagar (@telugufilmnagar) June 20, 2026
#Samantha at maa inti bangaram Success celebration pic.twitter.com/8orFx9dpuB
— Telugu360 (@Telugu360) June 20, 2026
