Vijay Deverakonda : దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ మరో రెండు సినిమాలు.. పాన్ ఇండియా స్క్రిప్ట్ రెడీ..

దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ మరో రెండు సినిమాలకు సైన్ చేసిన విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ఒక పాన్ ఇండియా స్క్రిప్ట్..

Vijay Deverakonda sign a two projects in dil raju production

Vijay Deverakonda : ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాని చేయబోతున్నారు. ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ భారీ చిత్రంగా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తరువాత విజయ్ మళ్ళీ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే నటించబోతున్నారని తెలుస్తుంది.

దిల్ రాజు బ్యానర్ లో విజయ్ రెండు సినిమాలకు సైన్ చేశారట. వీటిలో ఆల్రెడీ ఒకటి స్క్రిప్ట్ కూడా ఓకే అయ్యిపోయిందట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఆ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుందట. అయితే ఆ సినిమాకి దర్శకుడు ఎవరు..? అది ఎప్పుడు మొదలవుతుందని ఇంకా తెలియజేయలేదు. కాగా విజయ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్ అంట.

Also read : Tillu Square Collections : అమెరికాలో టిల్లు గాడి డీజే సౌండ్ గట్టిగా మోగుతుందిగా.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..!

ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడానికే ఏడాది పడుతుందని తెలుస్తుంది. ఆ మూవీ పూర్తి అయ్యేవరకు విజయ్ మరో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయరట. ఈక్రమంలో దిల్ రాజు, విజయ్ పాన్ ఇండియా సినిమా పట్టాలు ఎక్కాలంటే 2025లోనే అని తెలుస్తుంది. కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రస్తుతం తెలుగు తమిళంలో రిలీజ్ అవుతుంది. ఆ తరువాత హిందీ, మలయాళంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట.

గౌతమ్ తిన్ననూరితో చేయబోయే సినిమా విషయానికి వస్తే.. ఆ మూవీ స్టోరీ తమిళనాడు, శ్రీలంక బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతుందట. ఈక్రమంలోనే మూవీలో ఎక్కువుగా తమిళ ఆర్టిస్టులు కనిపించబోతున్నారట. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.