Tillu Square Collections : అమెరికాలో టిల్లు గాడి డీజే సౌండ్ గట్టిగా మోగుతుందిగా.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..!
అమెరికాలో టిల్లు గాడు రీ సౌండ్ చేస్తున్నాడు. అక్కడి టాప్ 10 సినిమాల్లో..

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie Three Days Collections Full Details
Tillu Square Collections : డీజే టిల్లుకి సీక్వెల్ గా సిద్ధూ జొన్నలగడ్డ తీసుకు వచ్చిన మరో ఎంటర్టైనింగ్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సీక్వెల్‌లో.. మొదటి మూవీ హీరోయిన్ నేహశెట్టి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 29న రిలీజయి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. అమీర్ పెట్ నుంచి అమెరికా వరకు టిల్లు గాడి డీజేని గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి రోజే 23.7 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు 45.3 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక మొదటి ఆదివారం కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇది ఇలా ఉంటే.. అమెరికాలో టిల్లు గాడి క్రేజ్ మాములుగా లేదుగా అసలు.
Also read : Vijay Deverakonda : కరోనా టైంలో విజయ్ దగ్గర మనీ లేక.. దిల్ రాజు దగ్గర అప్పు తీసుకున్నారట..
Tillanna’s Domination at the Box Office continues, Grosses over ??.? ?? in ? ????, racing towards ????? ????? ??
Our Starboy ?continues to shatter records all over! ??
– https://t.co/vEd8ktSAEW #TilluSquare #Siddu @anupamahere @MallikRam99 pic.twitter.com/PLvCefITDz
— Sithara Entertainments (@SitharaEnts) April 1, 2024
ఈ వారం టాప్ 10 బాక్స్ ఆఫీస్ మూవీస్ లిస్టుని ఓ ప్రముఖ అమెరికన్ వెబ్‌సైట్ రిలీజ్ చేసింది. ఆ లిస్టు టిల్లు స్క్వేర్ సినిమా 8వ స్థానంలో నిలిచింది. ఈ మూడు రోజుల్లో అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 1.83 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లను రాబట్టింది. ఇవాళ రేపులో ఈ సినిమా 2M మార్క్ ని కూడా క్రాస్ చేసేలా కనిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ని కూడా మరో రెండు మూడు రోజుల్లో అందుకునేలా కనిపిస్తుంది.
Tillanna’s beats take over the worldwide box office. ?
Our ?????? ??????????? #TilluSquare debuted at No. 8 in the US box office and the eventful party at the theatres by Tillu is set to smash records! ??
Thank you so much for such a thundering response! ❤️ pic.twitter.com/D8xoMIxcRs
— Sithara Entertainments (@SitharaEnts) April 1, 2024
కాగా ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి కూడా చూసారు. అప్పటిలో మొదటి సినిమా డీజే టిల్లు చూసిన తరువాత.. సిద్ధూని పిలిపించుకొని మరి చిరు అభినందించారు. మళ్ళీ ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ అవ్వడంతో.. దీనిని కూడా చూసి మూవీ టీంని ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
A praise that can make your day is a validation that your film is a bonafide blockbuster.? Megastar @KChiruTweets garu watched our #TilluSquare and appreciated it as a thorough entertainer. Thank you for your warm wishes, sir ❤️?#Siddu @anupamahere @vamsi84 pic.twitter.com/nHqo1MQtHZ
— Sithara Entertainments (@SitharaEnts) April 1, 2024